రోజ్ రోజ్ రోజ్ వాటర్...
బ్యూటిప్స్
రోజ్‌వాటర్‌ను అచ్చ తెలుగులో చెప్పాలంటే గులాబీ నీరు. దీనిని ముఖానికి పట్టిస్తే చాలా మంచిది. అయితే దానికొక పద్ధతి ఉంది. అదేమిటో చూద్దాం. కాటన్ బాల్‌ను రోజ్ వాటర్‌లో ముంచి ముఖం మీద అద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా ముఖచర్మం మీద ఉండే స్వేద గ్రంథులు తెరచుకొంటాయి. దానివల్ల ముఖ చర్మం తాజాగా ఉంటుంది. దీనికి మరికొన్ని పొడులు కలిపితే చర్మసౌందర్యం చెప్పనలవి కాదు. వాటిలో ముల్తానీ మట్టి బెస్ట్. ఇది అన్ని ఫేస్ ప్యాక్స్‌లో కంటే చాలామంచి ఫేస్ ప్యాక్. ఇది వేసుకోవడం ద్వారా చర్మం ప్రకాశిస్తుంది.
ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ చుక్కలను కలిపి ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసినట్లైతే ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది.ఆరెంజ్ ఫేస్‌ప్యాక్ చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేస్తుంది. నారింజ తొక్కలను ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసుకోవాలి. అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.