ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న బీట్‌రూట్ అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సీ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మొటిమలను వదిలించడంలో ఇవి రెండూ కీలక పాత్ర పోషిస్తాయి.
ఇక వీటికి జింక్, యాంటీబయోటిక్స్ తోడైతే మొటిమలు త్వరగా తగ్గుతాయి. అందువల్ల మొటిమలతో బాధపడుతున్నవారు బీట్‌రూట్ ప్యాక్‌ను ప్రయత్నిస్తే మంచి ఫలితం వస్తుంది.
బీట్‌రూట్ ప్యాక్ తయారీ:
►రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్‌రూట్ రసం వేసి బాగా కలపాలి.
►ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనివ్వాలి.
►తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
►ఇలా చేయడం వల్ల ముఖం మీది మొటిమలు, వాటి తాలుకూ మచ్చలు పోయి ముఖం కాంతిమంతమవుతుంది.
►వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఫలితం త్వరగా కనిపిస్తుంది.
►అదే విధంగా రోజూ ముఖానికి బీట్‌రూట్ రసం రాసి పది నిమిషాలపాటు మర్దన చేస్తే ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగి పోతాయి.
చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల...
Comments
Please login to add a commentAdd a comment