Acne prevention
-
వెల్లుల్లితో మొటిమలు మటుమాయం? నిపుణులు ఏమంటున్నారు?
వెల్లుల్లి గురించి దాదాపు తెలియని వారుండరు. మరో విధంగా చెప్పాలంటే వెల్లుల్లి లేని మసాలా వంట ఉండదు. కొంతమందికి వెల్లుల్లి వానస నచ్చనప్పటికీ, అల్లంవెల్లుల్లి మిశ్రమం వేసిన తరువాత ఏ రెసిపీ అయినా రుచి రెట్టింపు అవ్వడమేకాదు వాసన కూడా ఘుమ ఘమ లాడాల్సిందే. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే సౌందర్య పోషణగా కూడా పనిచేస్తుందంటారు. మరి ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని: ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల, మధుమేహం, బీపీ నియంత్రణలో ఉంటాయి. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది.అందేకాదు ఇది చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది.వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అలాగే రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గవచ్చట. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మ్యాజిక్ క్యూర్పచ్చి వెల్లుల్లి మోటిమలకు మ్యాజిక్ క్యూర్‌గా పనిచేస్తుందని ఇటీవల ఒక .బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్‌స్టా వీడియో వైరల్ అయిందితన 'రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్య'లో భాగంగా పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని నేరుగా తీసుకుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం చాలా మొండి సిస్టిక్ మొటిమలకు కూడాపనిచేస్తుందని కొంతమంది పేర్కొన్నారు. కొంతమంది కూడా సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం తమ సమస్యమరింత ఎక్కువైందని కమెంట్ చేయడం గమనార్హం.నిపుణుల మాట► వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ , క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి.► వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మొటిమలకుకారణమైన బ్యాక్టీరియాను (ప్రొపియోనిబాక్టీరియం) నిరోధిస్తుంది► రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణంగా కారణంగా, సేబాషియస్ గ్రంధి, వెంట్రుకల కుదుళ్లలో అనేక అడ్డుపడే పదార్థాలు క్లియర్ అవుతాయి.►వెల్లుల్లిలో జింక్,ఇతర విటమిన్లు ,ఖనిజాలు కూడా ఉన్నాయి. జింక్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.►వెల్లుల్లిలోని థియోసల్ఫేట్లు (సల్ఫర్ సమ్మేళనం) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.నోట్ : ఇది పలువురు నిపుణుల, రిపోర్టులు ఆధారిత కథనం మాత్రమే. ఈ చిట్కాలు కొందరిలో ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా వైద్యులను సంప్రదించడం మేలు. -
ఇలా చేస్తే ముఖంపై మొటిమలు మాయం!
పచ్చిపాలు, రోజ్ వాటర్‌ను సమపాళ్లల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వలయాకారంగా మర్దన చేయాలి. పదినిమిషాల తరువాత కాటన్ బాల్‌తో తుడిచేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పచ్చిపాలలో చిటికెడు ఉప్పు వేసి కలిపి, ముఖానికి అప్లై చేయాలి. ఐదు నిమిషాలు మర్దన చేసి చల్లటి నీటితో కడిగేయాలి. రెండు టేబుల్ స్పూన్ల వేపాకు పేస్టులో టేబుల్ స్పూను తేనె, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పచ్చి పాలు పోసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు పోయి ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తుంది. పచ్చిపాలు ఎండవేడికి పాడైన చర్మాన్ని సంరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తేమ కోల్పోయిన చర్మానికి తేమనందిస్తాయి. రోజూ క్రమం తప్పకుండా రెండుపూటలా ఈ వీటిలో ఏదైనా ఒక పద్ధతిని అనుసరిస్తే ముఖం మీద మొటిమలు వాటి తాలుకూ మచ్చలు పోయి ముఖం నిగారింపుతో మెరిసిపోతుంది. -
Beauty Tips: యాపిల్ సైడర్ వెనిగర్‌తో లాభాలెన్నో! మచ్చలు, చుండ్రు మాయం!
యాపిల్ సైడర్ వెనిగర్ బరువుని నియంత్రణలో ఉంచడంతోపాటు చర్మం, జుట్టుని కూడా చక్కగా సంరక్షిస్తుంది. యాపిల్ సైడర్‌వెనిగర్‌ను ముఖానికి రాసుకుంటే ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది. ►వెనిగర్‌లో మూడొంతుల నీళ్లు కలిపి ముఖానికి రాస్తే ముఖం మెరుపులీనుతూ కనిపిస్తుంది. ►యవ్వనంలో ఉన్న చాలామందికి మొటిమలు, నల్లమచ్చలు వేధిస్తుంటాయి. ►మొటిమలు మచ్చలపైన వెనిగర్ రాస్తే మచ్చలు ఇట్టే పోతాయి. ►వెనిగర్‌లోని పీహెచ్ స్థాయులు తక్కువగా ఉండడం చర్మానికి హాని లేకుండా సంరక్షిస్తుంది. కేశ పోషణ సైతం.. ►ముఖ చర్మానికి మాయిశ్చర్ అందించడంలో టోనర్లు చక్కగా పనిచేస్తాయి. ►మార్కెట్లో దొరికే వివిధ రకాల టోనర్ల కంటే యాపిల్ సైడర్ వెనిగర్ మంచి టోనర్‌గా బాగా పనిచేస్తుంది. ►సైడర్లో కొన్ని నీళ్లు కలిపి టోనర్‌లా వాడుకోవచ్చు. ►కాలుష్యం, రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల.. చర్మం పొడిబారి చుండ్రు వచ్చేస్తుంది. ►అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చుండ్రు మాత్రం వదలదు. ►యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల చుండ్రుని నియంత్రణలో ఉంచుతాయి. ►వెనిగర్‌లో నీళ్లు కలిపి కుదుళ్ల నుంచి జుట్టువరకు పట్టిస్తే జుట్టుకు పోషణ అంది వెంట్రుకలు పొడవుగా, ఒత్తుగా పెరుగుతాయి. చదవండి: Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు.. -
Beetroot: ముఖం మీది మొటిమలు, మృత కణాలు ఇట్టే మాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న బీట్రూట్ అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మొటిమలను వదిలించడంలో ఇవి రెండూ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక వీటికి జింక్, యాంటీబయోటిక్స్ తోడైతే మొటిమలు త్వరగా తగ్గుతాయి. అందువల్ల మొటిమలతో బాధపడుతున్నవారు బీట్రూట్ ప్యాక్‌ను ప్రయత్నిస్తే మంచి ఫలితం వస్తుంది. బీట్రూట్ ప్యాక్ తయారీ: ►రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనివ్వాలి. ►తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల ముఖం మీది మొటిమలు, వాటి తాలుకూ మచ్చలు పోయి ముఖం కాంతిమంతమవుతుంది. ►వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఫలితం త్వరగా కనిపిస్తుంది. ►అదే విధంగా రోజూ ముఖానికి బీట్రూట్ రసం రాసి పది నిమిషాలపాటు మర్దన చేస్తే ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగి పోతాయి. చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల... -
మొటిమల నివారణకు..
సాధారణంగా టీనేజ్లోనే బాధించే మొటిమలు వాటితో వచ్చే యాక్నె సమస్య ఇప్పుడు వాతావరణ కాలుష్యం కారణంగా ఎవరినీ వదలడం లేదు. ఇందుకోసం ఎక్కువ సమయం, డబ్బు వెచ్చించకుండా ఇంట్లోనే కొద్దిగా శ్రమ పడితే ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ► ముల్లంగిని మెత్తగా గ్రైండ్ చేసి అందులో రెండు టీ స్పూన్ల నిమ్మరసం, అంతే మోతాదులో టొమాటో రసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇది పట్టించిన తర్వాత ఐదు నిమిషాల సేపు కొద్దిగా మంట అనిపిస్తుంది. పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా ఒక వారం రోజుల పాటు రోజుకొకసారి చేస్తే మొటిమలు, వాటి కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ పూర్తిగా తగ్గుతాయి. ► మొటిమలు తగ్గినా కూడా వారానికొకసారి ఈ ప్యాక్ వేస్తే చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. మొటిమలు, యాక్నె రాకుండా ముఖం తేటగా ఉంటుంది. ► ముల్లంగిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి. 20 ఎం.ఎల్ రసానికి అంతే మోతాదులో మజ్జిగ కలిపి ముఖానికి పట్టించాలి. ఒక గంట సేపటి తర్వాత ముఖాన్ని వేడి నీటితో కడగాలి. ఈ ప్యాక్ చర్మగ్రంథుల నుంచి విడుదలయ్యే అదనపు జిడ్డును తొలగించి బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. ఇలా ఒక వారం చేస్తే కొత్త మొటిమలు రావు. అప్పటికే ఉన్నవి కూడా రాలిపోయి చర్మం నునుపుగా మారుతుంది.