Beauty Tips: Benefits Of Apple Cider Vinegar For Acne Free Skin And Dandruff Free Hair - Sakshi
Sakshi News home page

Apple Cider Vinegar Benefits: యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌తో లాభాలెన్నో! మచ్చలు, చుండ్రు మాయం!

Published Wed, Jul 27 2022 2:09 PM | Last Updated on Wed, Jul 27 2022 4:26 PM

Beauty Tips: Apple Cider Vinegar Helpful For Acne Free Skin Dandruff Free Hair - Sakshi

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ బరువుని నియంత్రణలో ఉంచడంతోపాటు చర్మం, జుట్టుని కూడా చక్కగా సంరక్షిస్తుంది. యాపిల్‌ సైడర్‌వెనిగర్‌ను ముఖానికి రాసుకుంటే ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది.

►వెనిగర్‌లో మూడొంతుల నీళ్లు కలిపి ముఖానికి రాస్తే ముఖం మెరుపులీనుతూ కనిపిస్తుంది.
►యవ్వనంలో ఉన్న చాలామందికి మొటిమలు, నల్లమచ్చలు వేధిస్తుంటాయి.
►మొటిమలు మచ్చలపైన వెనిగర్‌ రాస్తే మచ్చలు ఇట్టే పోతాయి.
►వెనిగర్‌లోని పీహెచ్‌ స్థాయులు తక్కువగా ఉండడం చర్మానికి హాని లేకుండా సంరక్షిస్తుంది.

కేశ పోషణ సైతం..
►ముఖ చర్మానికి మాయిశ్చర్‌ అందించడంలో టోనర్‌లు చక్కగా పనిచేస్తాయి.
►మార్కెట్లో దొరికే వివిధ రకాల టోనర్‌ల కంటే యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ మంచి టోనర్‌గా బాగా పనిచేస్తుంది.
►సైడర్‌లో కొన్ని నీళ్లు కలిపి టోనర్‌లా వాడుకోవచ్చు.
►కాలుష్యం, రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల.. చర్మం పొడిబారి చుండ్రు వచ్చేస్తుంది.
►అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చుండ్రు మాత్రం వదలదు.
►యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉండడం వల్ల చుండ్రుని నియంత్రణలో ఉంచుతాయి.
►వెనిగర్‌లో నీళ్లు కలిపి కుదుళ్ల నుంచి జుట్టువరకు పట్టిస్తే జుట్టుకు పోషణ అంది వెంట్రుకలు పొడవుగా, ఒత్తుగా పెరుగుతాయి.  
చదవండి: Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement