కాంతిహీనంగా మారిన చర్మం మదువుగా మారాలంటే... ఎన్నో జాగ్రత్తలు అవసరం! మొటిమలు, మచ్చలు, కళ్ల కింద వలయాలు ఇలా అన్నింటినీ పోగొట్టుకోవడానికి మార్కెట్‌లో దొరికే క్రీమ్స్ కంటే... ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే మంచివంటున్నారు నిపుణులు. పండ్లు, కూరగాయలు, డ్రై ప్రూట్స్ ఇలా వంటింటిలో దొరికే పదార్థాలతోనే చక్కని ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. తళతళా మెరిసిపోవచ్చు. నల్లని మచ్చలనే కాదు జిడ్డు, మొటిమలు శాశ్వతంగా పోగొట్టుకోవచ్చు. ట్రై చేయండి.
కావలసినవి:
ఓట్స్ – పావు టేబుల్ స్పూన్
తేనె – ముప్పావు టేబుల్ స్పూన్
శనగ పిండి – 1 టేబుల్ స్పూన్
ఆలీవ్ ఆయిల్ – పావు టేబుల్ స్పూన్
పాలు – 2 టేబుల్ స్పూన్స్
తయారీ: ముందుగా ఓట్స్, తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో శనగ పిండి, పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత ఆలీవ్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.. 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెరుపు మీ సొంతమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment