
ముఖం ఎంత అందంగా ఉన్నా, పులిపిరికాయలు వచ్చాయంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొటిమలైతే రెండు మూడు రోజుల్లో నయమవుతాయి గాని, పులిపిరి వస్తే దానంతట అది తగ్గదు. పులిపిరులు ముఖంపై మాత్రమే కాకుండా, శరీరంలో చర్మపు మడతల్లో ఎక్కువగా ఏర్పడతాయి.
అందాన్ని చెడగొట్టే పులిపిరుల సమస్యకు ఈ పరికరం చెక్ పెడుతుంది. ఇది ఎలాంటి నొప్పి లేకుండా, ఇతర దుష్ప్రభావాలేవీ లేకుండా పులిపిరులను సురక్షితంగా తొలగిస్తుంది. ఇది ఇంట్లో ఉన్నట్లయితే, పులిపిరులను తొలగించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లనక్కర్లేదు. శస్త్రచికిత్సలు, రసాయనిక చికిత్సలతో పనిలేకుండానే ఈ పరికరం సాయంతో పులిపిరులను సులువుగా తొలగించుకోవచ్చు.
ఈ 2 ఇన్ 1 మైక్రో టు లాడ్జ్ ఆటో స్కిన్ ట్యాగ్ రిమూవర్ కిట్‌లో.. 2 మిమీ – 8 మిమీ సైజుల్లోని చాలా రకాల బ్లేడ్స్ ఉంటాయి. వాటిని అవసరాన్ని బట్టి మార్చుకోవాల్సి ఉంటుంది. వాటికి అనువైన రెండు రకాల హెడ్స్ డివైస్‌తో పాటు లభిస్తాయి. వాటిని అడ్జస్ట్ చేసుకుని పులిపిరులను సులభంగా తొలగించుకోవచ్చు. పట్టుకోవడానికి, వాడుకోవడానికి ఈ పరికరం చాలా అనువుగా ఉంటుంది
ఈ పరికరాన్ని ఉపయోగించి, పులిపిరులను తీసిన తర్వాత చర్మంపై మచ్చ ఉండిపోతుందేమోనన్న భయం అక్కర్లేదు. ఆ మచ్చలు కూడా చాలా వేగంగా తగ్గిపోతాయి. ఇలాంటి పరికరాలు మార్కెట్‌లో చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పరికరాలను నిపుణులను సంప్రదించి ఉపయోగించడం మంచిది.
(చదవండి: ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?)
Comments
Please login to add a commentAdd a comment