బాలీవుడ్ ప్రసిద్ధ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో వేలాది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇటీవలే పండటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక గ్లామర్ పరంగా దీపికాకి సాటిలేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె మేని ఛాయ, కురులు కాంతిలీనుతూ ఉంటాయి. చూడగానే ముచ్చటగొలిపే తీరైన శరీరాకృతి చూస్తే..ఇంతలా ఎలా మెయింటెయిన్ చేస్తుందా? అనిపిస్తుంది కదూ. ఇంతకీ ఆమె బ్యూటీ రహస్యం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు దీన్ని రెగ్యులర్‌గా పాటిస్తే జస్ట్ మూడునెలల్లో దీపికాలాంటి మెరిసే చర్మం, జుట్టుని సొంతం చేసుకోవచ్చట. అదేంటో చూద్దామా..!.
మనం తీసుకునే ఆహరమే చర్మం, జుట్టు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే తాజా పండ్లు, కూరగాయాలకు ప్రాధాన్యత ఇవ్వండని పదేపదే సూచిస్తుంటారు. అయితే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ పూజ అనే మహిళ జ్యూస్ రెసిపీతో కూడిన వీడియో పోస్ట్ చేసింది.
అందులో ఇది బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు మూడు నెలల్లో మెరిసే చర్మం, మెరిసే జుట్టుని పొందడంలో సహయపడిందని పేర్కొనడంతో ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. నిజానికి ఆ జ్యూస్ రెసిపీలో ఉపయోగించిన పదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవే. పైగా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి.
ఆ జ్యూస్ ఏంటంటే..
వేప, కరివేపాకు, బీట్‌రూట్, పుదీనాలతో చేసిన జ్యూస్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బయోస్కావెంజర్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉపయోగించినవన్నీ మంచి చర్మాన్ని, బలమైన జుట్టుని పొందడంలో ఉపయోగపడేవే.
ప్రయోజనాలు..
వేప ఆకులు: ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి వేప ఆకులు శరీర నిర్విషీకరణకు దోహదం చేస్తాయి. ఇది మొటిమలను నియంత్రించి చర్మ కాంతివంతంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది.
బీట్‌రూట్: ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ సీలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణకు, శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి ముఖ్యమైనవి. ఇది చర్మాన్ని మృదువుగానూ, ఆర్యోకరమైన రంగుని అందిస్తుంది. అలాగే జుట్టు స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కొత్తిమీర ఆకులు: దీనిలో విటమిన్ ఏ, సీ కేలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్దీ చేసి మేని ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచడమే గాక హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది.
పుదీనా ఆకులు: పుదీనా యాంటీఆక్సిడెంట్ లక్షణాల తోపాటు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వేడిని తగ్గించి శరీరాన్ని లోపలి నుంచి పునరుజ్జీవింపజేపసి మొటిమలను నివారిస్తుంది.
తయారీ విధానం..
కట్ చేసుకున్న బీట్‌రూట్ ముక్కలు, కరివేపాకు, వేపాకులు, కొత్తిమీర, పుదీనా వంటి పదార్థాలన్ని మిక్కీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పిప్పితో సహా తాగడం కష్టంగా ఉంటే..వడకట్టుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఉదయాన్నే తాజాగా తీసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా కనీసం మూడు నెలలు ఈ జ్యూస్‌ని తీసుకుంటే కాంతివంతమైన మేని ఛాయ, ఒత్తైన జుట్టు మీ సొంతం.
(చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు)
Comments
Please login to add a commentAdd a comment