
ఫ్రూట్స్ ఫేస్ ప్యాక్
బ్యూటిప్స్
పియర్ – సగం; ఆపిల్ – సగం
ద్రాక్ష – 3
నిమ్మరసం – టీ స్పూన్
కోడిగుడ్డు – 1
పియర్‌ని, ఆపిల్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ద్రాక్షలో గింజలు తీసేసి, అన్నింటినీ కలిపి మిక్సీలో తిప్పాలి. దీంట్లో నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 30 నిమిషాల పాటుంచి చన్నీటితో కడిగేయాలి. వేసవిలో ఈ ఫ్రూట్ ప్యాక్‌ని పది రోజులకి ఒకసారి వేసుకోవడం వల్ల చర్మంలో జిడ్డు తగ్గి కాంతివంతం అవుతుంది.