
'మేరీ ఆషీకి తుమ్ సే హై' అనే టీవీ షోతో కెరీర్ ఆరంభించింది ఢిల్లీ బ్యూటీ రాధికా మదన్. 2018లో పటాకా సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఇక ఆంగ్రేజీ మీడియం సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూతురిగా నటించి మెప్పించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనితో పాటు రే వెబ్‌సిరీస్‌లోనూ తన నటనకు గానూ రాధిక విమర్శల ప్రశంసలు అందుకుంది. త్వరలోనే కుట్టీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాధికా.. తన బ్యూటీ సీక్రెట్ ఏమిటో అభిమానులతో పంచుకుంది.
అమ్మమ్మ, అమ్మ నుంచి వారసత్వంగా..
‘నా చర్మ సౌందర్య రహస్యం.. ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాకే. ఇది మా అమ్మమ్మ, అమ్మ నుంచి వారసత్వంగా అందిన చిట్కా అని చెప్పొచ్చు. చాలా సింపుల్. ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి, ఒక టీ స్పూస్ పసుపు, రెండు టీ స్పూన్ల బాదం పప్పు పొడి, ఒక టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు పాలు.. అన్నిటినీ కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి.
దీనిని మొహానికి, మెడకు అప్లయ్ చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసు కోవాలి. మెత్తటి టవల్‌తో తడిపొడిగా తుడుచుకుని మాయిశ్చరైజన్ రాసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా.. మొహం డ్రై అవకుండా తేమతో నిగనిగలాడుతూ ఉంటుంది’’ అని రాధికా మదన్ చెప్పుకొచ్చింది.
చదవండి: Anushka Sharma Beauty Secret: టీనేజ్‌లో ఉన్నపుడు అమ్మ చెప్పింది.. నా బ్యూటీ సీక్రెట్ అదే!
Beauty Tips: నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? ఈ సులభమైన చిట్కాలతో చెక్ పెట్టేయండి!
Comments
Please login to add a commentAdd a comment