కేశాలకు తగినంత పోషణ, నూనె లేనప్పుడు వీటికి తోడుగా ఎక్కువ వేడి తగులుతున్నట్లయితే చివర్లు చిట్లుతాయి. ఇలాంటప్పుడు హెయిర్ డ్రయర్‌లు వాడకపోవడమే మంచిది. కనీసం వారానికి ఒక రోజు చిట్లిన చివర్లను కత్తిరించుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్ స్పూను ఆముదాన్ని గోరువెచ్చగా చేసి తలకు, జుట్టు చివర్ల వరకు పట్టించి, ఉదయం తలస్నానం చేయాలి. ఒక టీ స్పూను ఆముదం, అంతే మోతాదులో ఆవనూనె, ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి మర్దన చేసి జుట్టుకంతటికీ చివరి వరకు పట్టించాలి. తరువాత వేడి నీటిలో ముంచిన టవల్‌ను తలకు చుట్టి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
బ్లెమిషెస్ పోవాలంటే..
ముఖం మీద ఉన్న మచ్చలు పోవాలంటే నిమ్మకాయ బాగా పని చేస్తుంది. ప్యాక్‌ల కోసం టైం కేటాయించలేని వాళ్లు వంటలోకి పిండిన నిమ్మచెక్కను తిరగేసి ముఖానికి రుద్ది పది నిమిషాల తర్వాత చన్నీటితో కడిగితే చాలు. క్రమంగా మచ్చలు చర్మంలో కలిసిపోతాయి.నిమ్మచెక్కను రసం పిండేసిన తర్వాత వెనక్కి తిప్పి చక్కెరలో అద్ది ముఖానికి మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే నల్లమచ్చలు, యాక్నె, పింపుల్స్ అన్నీ పోయి ముఖం క్లియర్‌గా మారుతుంది.రెండు టీ స్పూన్ల పెసరపిండిలో చిటికెడు పసుపు కలిపి అందులో రెండు చుక్కల నిమ్మరసం, ఒక స్పూను పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ప్రతిరోజూ ఈ ప్యాక్ వేస్తుంటే నెల రోజులకు ముఖంలో ఊహించని మార్పు చోటుచేసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment