hair drying
-
జస్ట్ హెయిర్ డ్రైయర్ ఉపయోగించినందుకు.. ఏకంగా రూ. 78 వేలు..!
కొన్నిసార్లు స్టార్ హోటళ్లు, లగ్జరీ హోటళ్లు విలాసవంతంగా ఉంటాయని ఒక్కసారి అయినా స్టే చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ఆ హోటళ్లలో కొంతమంది కస్టమర్లకు ఎదరైన చేదు అనుభవాలు వింటే దెబ్బకు ఆ ఆలోచన కూడా చేయరు. అసలు వాటి వైపుకి వెళ్లే యత్నం కూడా చేయరు. ఇక్కడొక మహిళ కూడా అచ్చం అలాంటి దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. మళ్లీ హోటల్లో స్టే చేయాలంటేనే భయపడింది. వివరాల్లోకెళ్తే..ఆస్ట్రేలియాలోని పెర్త్‌కి చెందిన ఒక మహిళ నోవాటెల్ పెర్త్ లాంగ్లీ హోటల్లో బస చేసింది. ఆమెకి కింగ్స్ పార్క్‌లో మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంగీత కచేరి ఉంది. అందుకోసం ఆ మహిళ ఈ నోవాటెల్‌లో బస చేసింది. అయితే ఆ మహిళ తన ప్రదర్శనకు వెళ్లే ముందు గదిలో స్నానం చేసి డ్రైయర్‌ని ఉపయోగించి జుట్టుని ఆరబెట్టుకుంది. అయితే దుస్తులు మార్చకోక మునుపే ఆమె డోర్ వెలుపలే అగ్నిమాపక సిబ్బంది కాచుకున్నారు. ఆ డ్రైయర్‌ని ఉపయోగించడంతో ఎమర్జెన్సీ అలారం మోగడంతో ఈ హఠాత్పరిణామం చోటు చేసుకుంది. ఈ తతంగం అంతా చూసి ఆ మహిళ షాకయ్యింది. అయితే సదరు మహిళ కాస్త తమాయించుకుని వాళ్లకి క్షమాపణ చెప్పడమే గాక వారిని కంగారు పెట్టించినందుకు డబ్బులు కూడా కట్టింది. అంతవరకు బాగానే ఉంది. సదరు హోటల్ కూడా ఆమె నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే ఆమెను షాక్‌కి గురి చేసింది. అయితే ఆమె హోటల్ నుంచి వెళ్లేటప్పుడూ ఇదంతా గమనించలేదు. ఆ తర్వాత తన బ్యాంక్ ఎకౌంట్ చెక్ చేయగా కేవలం డ్రైయర్ ఉపయోగించినందుకు ఏకంగా రూ. 78 వేలు బిల్లు వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆమె కంగుతింది. ఏంటీది అని కంగారు పడి వెంటనే సదరు హోటల్‌కి ఫోన్ చేయగా, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగేలా చేశారు అందుకని అంటూ ఏవేవో సమాధానాలు ఇచ్చారు హోటల్ సిబ్బంది. పైగా ఆమె ఫోన్‌కాల్స్‌ని రిసీవ్ చేయకుండా ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు. ఇక లాభం లేదనుకుని మేనేజర్‌కి ఇమెయిల్స్ అదేపనిగా పెట్టడంతో ఎట్టకేలకు సదరు హోటల్ మేనేజర్ ఆమె డబ్బులు వాపసు చేశాడు. ఇలాంటి వింత ఘటనే చైనాలో కూడా జరిగింది. ఓ మహిళ హోటల్లో రెండు రోజులు బస చేసేందుకు రూమ్‌ని బుక్ చేసుకుంది. అయితే జస్ట్ రెండు సార్లు స్నానం చేసిందని అదనంగా రూ. 28,850 వసూలు చేయడంతో విస్తుపోయింది సదరు మహిళ. (చదవండి: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే..మగవాళ్లు డ్రింక్ చేయకూడదట! అధ్యయనంలో షాకింగ్ విషయాలు) -
జుట్టును కాపాడుకోవడానికి ఈ ప్రొఫెషనల్ డ్రైయర్ ఉండాల్సిందే
నిగారింపుతో ముఖం ఎంతగా మెరిసిపోయినా తల మీద తగినంత జుట్టు లేకపోతే ఆ అందం కళాహీనమే. అందుకే చాలామంది మహిళలు కేశసంరక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. వారానికో హెయిర్ మాస్క్, రోజు విడిచి రోజు హెయిర్ మసాజ్‌లు.. ఇలా తమకు తెలిసిన పద్ధతిలో జుట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే వారానికి రెండుమూడుసార్లు తలస్నానం చెయ్యడం మంచిదంటారు నిపుణులు. నిజానికి తల స్నానం చేయడంతో పాటు జుట్టును ఆరబెట్టుకోవడమూ కష్టమైన పనే.. బిజీ లైఫ్‌లో! అందుకే ఈ ప్రొఫెషనల్ ఎయిర్ డ్రైయర్ ఇంట్లో ఉండాల్సిందే! చిత్రంలోని ఈ డివైస్.. గిరిజాల జుట్టు.. మందపాటి జుట్టు.. ఇలా అన్ని రకాల జుట్టుకూ ప్రయోజనం కలిగిస్తుంది. ఆన్, ఆఫ్, హై, లో అనే ఆప్షన్స్‌తో దీన్ని వినియోగించడమూ తేలికే! నెగెటివ్ అయానిక్ టెక్నాలజీతో కూడిన ఈ హెయిర్ డ్రైయర్.. భారీ ప్రతికూల అయాన్లను విడుదల చేయడంతో జుట్టులోని తేమను పోగొట్టి.. మృదువుగా మారుస్తుంది. జుట్టును కాపాడుతుంది. ఈ సాధనం చాలా తేలికగా చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇది స్టెయిలింగ్ ఫ్లెక్సిబిలిటీతో పాటు.. కంట్రోల్ కోసం 2 విభిన్న స్పీడ్ మోడ్‌లను అందిస్తుంది. అలాగే ఇందులోని రెండు ప్రత్యేకమైన హెడ్స్‌ని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఆటోలీకేజ్ సంరక్షణ కోసం సేఫ్టీ ప్లగ్‌తో.. ఈ డ్రైయర్ అప్‌గ్రేడ్ అయ్యింది. దాంతో దీన్ని ఉపయోగించినప్పుడు షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ లీకేజీ జరిగితే.. ఓవర్–హీట్ ప్రొటెక్షన్లు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. ధర 35 డాలర్లు. అంటే 2,894 రూపాయలు. -
ఓరి వీడి వేశాలో... తల ఆరబెట్టాలంటే ఇలా చేయాలా!
Man Using Pressure Cooker To Hair Dryer Viral Video: సోషల్‌మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అవి వెంటనే నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇక వాటిలో కొన్ని వైరల్‌గా మారి రచ్చ కూడా చేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని వీడియోలు సంతోషాన్ని ఇస్తే, కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, మరికొన్ని కొపాన్ని కూడా తెప్పిస్తాయి. తాజాగా ఓ యువకుడు తలను ఆరబెట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ఒక యువకుడు తల స్నానం చేసి వచ్చాడు. సాధారణంగా తల స్నానం తర్వాత తడి జుట్టుని ఆరబెట్టడానికి ఎవరైనా టవల్‌తో తడి ఆరే వరకు మర్ధన చేయడమో, లేదా హెయిర్ డ్రైయర్ వాడడమో చేస్తారు. కానీ ఆ యువకుడు కాస్త వెరైటీ ఉంటుందని ప్రెజర్ కుక్కర్ ద్వారా ఆరబెట్టుకున్నాడు. అదెలా అనుకుంటున్నారా! ప్రెజర్ కుక్కర్ విజిల్ సమయంలో వచ్చే వేడి గాలి ద్వారా తన తలను ఆరబెట్టుకున్నాడు. ఈ హెయిర్ డ్రైయర్ ఐడియానుచూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది యువకుడు జుట్టు ఆరబెట్టే బాగుందని కామెంట్ పెట్టగా, మరికొందరు కుక్కర్ పగిలిపోయే ప్రమాదం ఉందని కామెంట్లు పెట్టారు. వాట్ ఎన్ ఐడియా సర్ జీ అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by black_lover__ox (@black_lover__ox) చదవండి: Viral Video: అగ్నిప్రమాదమా? అయితే మాకేంటి ముందు పొట్టనిండాలి! -
జుట్టు చిట్లుతుంటే...
కేశాలకు తగినంత పోషణ, నూనె లేనప్పుడు వీటికి తోడుగా ఎక్కువ వేడి తగులుతున్నట్లయితే చివర్లు చిట్లుతాయి. ఇలాంటప్పుడు హెయిర్ డ్రయర్లు వాడకపోవడమే మంచిది. కనీసం వారానికి ఒక రోజు చిట్లిన చివర్లను కత్తిరించుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్ స్పూను ఆముదాన్ని గోరువెచ్చగా చేసి తలకు, జుట్టు చివర్ల వరకు పట్టించి, ఉదయం తలస్నానం చేయాలి. ఒక టీ స్పూను ఆముదం, అంతే మోతాదులో ఆవనూనె, ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి మర్దన చేసి జుట్టుకంతటికీ చివరి వరకు పట్టించాలి. తరువాత వేడి నీటిలో ముంచిన టవల్‌ను తలకు చుట్టి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. బ్లెమిషెస్ పోవాలంటే.. ముఖం మీద ఉన్న మచ్చలు పోవాలంటే నిమ్మకాయ బాగా పని చేస్తుంది. ప్యాక్‌ల కోసం టైం కేటాయించలేని వాళ్లు వంటలోకి పిండిన నిమ్మచెక్కను తిరగేసి ముఖానికి రుద్ది పది నిమిషాల తర్వాత చన్నీటితో కడిగితే చాలు. క్రమంగా మచ్చలు చర్మంలో కలిసిపోతాయి.నిమ్మచెక్కను రసం పిండేసిన తర్వాత వెనక్కి తిప్పి చక్కెరలో అద్ది ముఖానికి మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే నల్లమచ్చలు, యాక్నె, పింపుల్స్ అన్నీ పోయి ముఖం క్లియర్‌గా మారుతుంది.రెండు టీ స్పూన్ల పెసరపిండిలో చిటికెడు పసుపు కలిపి అందులో రెండు చుక్కల నిమ్మరసం, ఒక స్పూను పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ప్రతిరోజూ ఈ ప్యాక్ వేస్తుంటే నెల రోజులకు ముఖంలో ఊహించని మార్పు చోటుచేసుకుంటుంది. -
ఆడాళ్లూ.. హెయిర్ డ్రయర్ వాడొద్దు!
ఆడవాళ్లు తలంటు పోసుకున్న తర్వాత.. జుట్టు ఆరబెట్టుకోడానికి హెయిర్ డ్రయర్లు వాడటంపై వెనిజువెలా అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. డ్రయర్లు వాడటం కంటే ఎంచక్కా చేతి వేళ్లను జుట్టులోకి పోనిచ్చి.. సహజంగానే ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుందని ఆయన అన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఆ దేశంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. అందుకోసం విద్యుత్ వాడకాన్ని తగ్గించడానికి అధ్యక్షుడు నికొలస్ మదురో ఈ తరుణోపాయం చూపించారు. డ్రయర్లు వాడుతుంటే విద్యుత్తు ఎక్కువగా ఖర్చవుతుందని, అందువల్ల వాడకం తగ్గాలంటే చేతివేళ్లతోనే జుట్టు ఆరబెట్టుకోవాలని ఆడాళ్లకు ఆయన సూచించారు. ఇలా చేస్తే సహజంగా ఉండటంతో పాటు చాలా అందంగా కనిపిస్తారని కూడా ఆయన అంటున్నారు. కానీ మహిళలు మాత్రం అధ్యక్షుడి సూచన విని ఆశ్చర్యపోతున్నారు. దేశంలో విద్యుత్ సమస్య దశాబ్ద కాలానికి పైగా ఉందని, దాన్ని అరికట్టడానికి తగిన చర్యలు ఏవీ తీసుకోలేదని మండిపడుతున్నారు. తమ జుట్టు వల్లే విద్యుత్ వాడకం ఎక్కువైపోతోందా అంటూ ఒంటి కాలిమీద లేస్తున్నారు.