Man Using Pressure Cooker To Hair Dryer Viral Video: సోషల్‌మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అవి వెంటనే నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇక వాటిలో కొన్ని వైరల్‌గా మారి రచ్చ కూడా చేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని వీడియోలు సంతోషాన్ని ఇస్తే, కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, మరికొన్ని కొపాన్ని కూడా తెప్పిస్తాయి. తాజాగా ఓ యువకుడు తలను ఆరబెట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో.. ఒక యువకుడు తల స్నానం చేసి వచ్చాడు. సాధారణంగా తల స్నానం తర్వాత తడి జుట్టుని ఆరబెట్టడానికి ఎవరైనా టవల్‌తో తడి ఆరే వరకు మర్ధన చేయడమో, లేదా హెయిర్ డ్రైయర్ వాడడమో చేస్తారు. కానీ ఆ యువకుడు కాస్త వెరైటీ ఉంటుందని ప్రెజర్ కుక్కర్ ద్వారా ఆరబెట్టుకున్నాడు. అదెలా అనుకుంటున్నారా! ప్రెజర్ కుక్కర్ విజిల్ సమయంలో వచ్చే వేడి గాలి ద్వారా తన తలను ఆరబెట్టుకున్నాడు. ఈ హెయిర్ డ్రైయర్ ఐడియానుచూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది యువకుడు జుట్టు ఆరబెట్టే బాగుందని కామెంట్ పెట్టగా, మరికొందరు కుక్కర్ పగిలిపోయే ప్రమాదం ఉందని కామెంట్లు పెట్టారు. వాట్ ఎన్ ఐడియా సర్ జీ అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.
చదవండి: Viral Video: అగ్నిప్రమాదమా? అయితే మాకేంటి ముందు పొట్టనిండాలి!
Comments
Please login to add a commentAdd a comment