
అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే ‘వేప’ను కాదని చర్మసంరక్షణకు బ్యూటీ ప్రొడక్టులు వాడుతూ, పైసలు వసూలు చేసే పార్లర్ల వెంట తిరుగుతూ ఉంటారు. సౌందర్య ఉత్పత్తులలో వేప ఆకులను, వేళ్లను ఉపయోగించడం వెనుక ఉన్న చరిత్ర ఈ నాటిది కాదు 4,000 ఏళ్ళ క్రితం నాటిది. గుప్పెడు వేపాకులు గుప్పెడు వేపాకులు శుభ్రంగా కడిగి, రెండు లీటర్ల నీటిలో వేసి మరిగించాలి. ఎంతవరకు అంటే ఆకులు మెత్తగా అయ్యి నీళ్ల రంగు మారాలి. ఈ నీటిని చల్లార్చి గాజు బాటిల్లో పోసి ఉంచాలి. బకెట్ నీళ్లలో ఒక కప్పు వేపనీళ్లు కలిపి రోజూ స్నానం చేస్తే చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లు, యాక్నె వంటివి మెల్ల మెల్లగా తగ్గిపోతాయి.
మృదువైన స్కిన్ టోనర్
స్కిన్ టోనర్‌కి మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్‌ని తెచ్చి వాడేస్తుంటారు. కానీ, వేప నీళ్లలో ఒక దూది ఉండను ముంచి, రోజూ రాత్రి పడుకునేముందు ముఖమంతా తుడిచేయండి. స్వేదరంధ్రాలలోని మలినాలు తొలగిపోయి చర్మకాంతి పెరుగుతుంది. చర్మం శుభ్రపడటం వల్ల యాక్నె, స్కార్స్, పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ .. మెల్లగా తగ్గిపోతుంటాయి.
మిలమిలలు పెంచే ఫేస్‌ప్యాక్
పది వేపాకులను మెత్తగా నూరి కప్పు నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నీళ్లలో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీన్ని వారానికి మూడుసార్లు ముఖానికి పట్టించి, చల్లటి నీళ్లతో కడిగేస్తే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, యాక్నె నుంచి విముక్తి లభిస్తుంది. పోర్స్‌లో మలినాలు శుభ్రపడతాయి.
కేశాలకు కండిషనర్
వేపాకులను మరిగించిన నీళ్లతో తలస్నానం చేసిన తర్వాత జుట్టు కడుక్కోండి. ఇలా తరచూ చేస్తే చుండ్రు తగ్గడమే కాదు వెంట్రుకలూ మృదువుగా
అవుతాయి. అంటే కేశాలకు వేపాకులు సహజసిద్ధమైన కండిషనర్ అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment