
టాటా ట్యాన్!
ఎండకు పోతే చర్మం నల్లబారుతుంది. కాలేజ్, ఉద్యోగం, వ్యాపారం వంటి యాక్టివిటీలన్నీ పక్కన పెట్టి నీడపట్టున ఉండడం కుదిరే పని అసలే కాదు. అందుకే ఎండకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్‌ప్యాక్ వేసి ట్యాన్‌ను తొలగించుకోవడమే మంచి ప్రత్యామ్నాయం.
క్యారట్ ఫేస్ ప్యాక్... ఎర్రని క్యారట్‌ను గ్రైండ్ చేసి రసం తీసుకుని అందులో నాలుగైదు చుక్కల బాదం నూనె కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత వేడి నీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి నెలరోజుల పాటు ప్యాక్ వేస్తే ముఖం మీద ఉన్న ట్యాన్‌తో పాటు ఇతర మచ్చలు పోయి ముఖవర్చస్సు పెరుగుతుంది.
హనీ– ఎగ్ ప్యాక్... అర టీ స్పూను తేనెలో కోడిగుడ్డు సొన, ఒక టేబుల్‌స్పూను పాలపొడి లేదా పాలు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడగాలి.