శీతాకాలంలో... | National treasure Anne Deveson faces up to Alzheimer's dia | Sakshi
Sakshi News home page

శీతాకాలంలో...

Published Sun, Feb 1 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

శీతాకాలంలో...

శీతాకాలంలో...

శీతాకాలంలో పెదవులు, ముఖంపై చలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పొడారిపోవడం, గరుకుగా తయారుకావడం, చర్మం బిగుతుగా మారిపోవడం వంటి సమస్యలు తలెత్తుంటాయి. వీటి నివారణకు కొన్ని చిట్కాలు...     
రోజూ  పడుకునే ముందు ముఖానికి బాదం నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ రాయాలి. ఆయిల్ పెట్టేముందు మురికి లేకుండా చర్మం శుభ్రంగా ఉండాలనే సంగతి మర్చిపోకూడదు.

రోజూ పదినిమిషాల సేపు చర్మాన్ని హాట్ థెరపీతో స్వాంతన పరచాలి. అదెలాగంటే... గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఉదయం స్నానం చేయడానికి ముందుకానీ రాత్రి పడుకునే ముందుకానీ చేయవచ్చు.
ఒక కోడిగుడ్డు సొనలో, 1 టీ స్పూన్ కమలారసం, 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. పొడిచర్మానికి ఈ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది.
బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. మెడనల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపును కూడా వదిలిస్తుంది.
పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్‌సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. దేనితోనూ కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్‌ను యథాతథంగా ఒంటికి రాసి మర్దన చేస్తే సరిపోతుంది. ఇది ఇప్పుడు అన్ని సూపర్‌మార్కెట్లలోనూ దొరుకుతోంది.
ఫేస్‌ప్యాక్‌లకు బదులుగా స్వచ్ఛమైన ఆముదం కానీ అవొకాడో ఆయిల్ కానీ చర్మానికి రాసి మర్దన చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement