
సడెన్‌గా ఏదైనా పార్టీకి వెళ్లాల్సి రావచ్చు. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే టైమ్ ఉండవచ్చు ఉండకపోవచ్చు. అందుకే ఇంట్లో తయారు చేసుకునే కొన్ని ఫేస్ ప్యాక్‌లను ఇక్కడ చూడండి. ఈ ఫేస్‌ప్యాక్‌లలో వాడేవన్నీ ఇంట్లో ఉంటాయి.
ఎగ్ –హనీ మాస్క్
కావాల్సినవి...
1. ఒక ఎగ్, 2. ఒక టీ స్పూన్ తేనె, 3. అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, 4. కొన్ని చుక్కల రోజ్ వాటర్
పైవన్నీ బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చన్నీరు లేదా గోరువెచ్చటి నీటిని చల్లుతూ సున్నితంగా వలయాకారంగా రుద్దుతూ శుభ్రం చేయాలి.
ఎగ్ – బాదం మాస్క్
కావాల్సినవి...
1. ఒక టేబుల్ స్పూన్ తేనె, 2. ఒక గుడ్డు సొన, 3. అర టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, 4. ఒక టేబుల్ స్పూన్ పెరుగు
వీటన్నింటిని బాగా కలిపి మాస్క్ వేసుకోవాలి. ఈ ప్యాక్ డ్రైస్కిన్‌కి బాగా పనిచేస్తుంది. ఇది ముఖానికి కావాల్సిన ప్రాథమిక అవసరాలన్నీ తీరుస్తుంది. తేనె చర్మాన్ని శుభ్రపరిచి సున్నితంగా తయారు చేస్తుంది. ఆయిల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పెరుగు చర్మాన్ని బిగుతుగా చేసి నవయవ్వనాన్ని తెచ్చిపెడుతుంది. ఎగ్ చర్మానికి అవసరమైన పోషకాలను, పటుత్వాన్ని ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment