
మచ్చలు, మొటిమలతో చర్మం కాస్త రఫ్‌గా మారితే చాలు మగువలు నానా హైరానా పడుతుంటారు. అవి పూర్తిగా తగ్గేంతవరకూ ఫేస్‌క్రీమ్స్ వేటలో పడిపోతారు. ఒకటి కాదంటే మరొకటంటూ రకరకాల క్రీమ్స్ వాడి మరింత రఫ్‌గా మార్చుకుంటారు. ఇకపై అలాంటి ప్రయత్నాలను పక్కన పెట్టి.. చక్కగా ఇంటిపట్టునే ఫేస్ ప్యాక్‌కి ప్రయత్నించండి. కెమికల్స్ నింపిన ఫేస్ క్రీమ్స్ కంటే చక్కటి ఫేస్ ప్యాక్ అన్ని విధాలా మంచిదంటున్నారు నిపుణులు. మరింకెందుకు ఆలస్యం ఇలా ట్రై చెయ్యండి.
కావలసినవి: దానిమ్మ గింజల గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్, గ్రీన్ టీ – అర టేబుల్ స్పూన్ (తాజాగా కాచినది)పెరుగు – పావు టేబుల్ స్పూన్, తేనె – పావు టేబుల్ స్పూన్
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మెత్తగా తయారు చేసుకున్న దానిమ్మ గుజ్జు, గ్రీన్ టీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో తేనె, పెరుగు యాడ్ చేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ముఖానికి ఆవిరి పట్టుకుని.. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాలు పాటు బాగా ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇదే విధంగా వారానికి రెండు లేదా మూడుసార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment