
టమాటాను చిదిమి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే ముఖం మీద ఉన్న జిడ్డు పోయి రోజంతా తాజాగా ఉంటుంది. వంట కోసం వాడేటప్పుడు చిన్న ముక్కను తీసుకుని ముఖానికి రుద్దుకోవచ్చు. పాడయిన వాటిని వంటల్లో వేయకుండా పారేస్తుంటాం, కాని చాలా వాటిలో కాయ మొత్తం పాడవకుండా ఒకవైపు బాగుంటాయి. అలాంటి వాటిని కూడా వాడుకోవచ్చు. కొంతమందికి టమాటా సరిపడదు, స్కిన్‌కు ఇరిటేషన్ వస్తుంటుంది. అలాంటప్పుడు ఒకటి – రెండు ద్రాక్ష పండ్లను చిదిమి ముఖానికి రాసుకోవచ్చు.
క్యారట్ ఫేస్ మాస్క్
ఎర్రని క్యారట్‌ను గ్రైండ్ చేసి రసం తీసుకుని అందులో నాలుగైదు చుక్కల బాదం నూనె కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత వేడి నీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి నెలరోజుల పాటు ప్యాక్ వేస్తే ముఖం మీద ఉన్న ట్యాన్‌తో పాటు ఇతర మచ్చలు పోయి ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment