
కిచెన్‌లో అందుబాటులో ఉండే బంగాళదుంపతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు ఇలా... బంగాళదుంపను శుభ్రంగా కడిగి, చెక్కు తీయకుండా మెత్తగా ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత నీటిని వంపేసి స్పూన్‌తో మెదుపుకోవాలి.
దీంట్లో ఒక టీ స్పూన్ పాల పొడి, తగినంత కొబ్బరి నూనె గాని, బాదం నూనె గాని వేసి కలిపి పేస్ట్ చేయాలి. ముఖం శుభ్రపరిచిన తర్వాత ఈ ఫేస్ ప్యాక్ మెడ మొదలుకొని ముఖానికంతటికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. పదిహేను రోజులకు ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం కాంతివంతమవుతుంది.