సాక్షి, హైదరాబాద్: నాలుగు పర్యాయాలు ఎంపీ అయిన తన ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ దార్సుసలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలోని తన ఇంటిపై రాళ్ల దాడి జరగడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఒక వైపు ముస్లింల ఇళ్లపై బుల్డోజర్లు ప్రయోగిస్తూనే, మరోవైపు ఎంపీ ఇంటిపై రాళ్లు రువ్వుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చివేతలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రాళ్ల దాడులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదన్నారు. ఇలాంటి ఘటన బీజేపీ నేత ఇంటిపై జరిగితే స్పందన మరోలా ఉండేదని ఒవైసీ అన్నారు. దేశంలో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని, కనీసం స్వాత్రంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనైనా స్పందిస్తారా? కనీసం ఖండిస్తారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ ఎక్కడ ఉంది? అంటూ నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment