Stoned
-
ఎంపీ ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే సామాన్యుడి పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: నాలుగు పర్యాయాలు ఎంపీ అయిన తన ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ దార్సుసలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలోని తన ఇంటిపై రాళ్ల దాడి జరగడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఒక వైపు ముస్లింల ఇళ్లపై బుల్డోజర్లు ప్రయోగిస్తూనే, మరోవైపు ఎంపీ ఇంటిపై రాళ్లు రువ్వుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చివేతలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రాళ్ల దాడులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదన్నారు. ఇలాంటి ఘటన బీజేపీ నేత ఇంటిపై జరిగితే స్పందన మరోలా ఉండేదని ఒవైసీ అన్నారు. దేశంలో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని, కనీసం స్వాత్రంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనైనా స్పందిస్తారా? కనీసం ఖండిస్తారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఎక్కడ ఉంది? అంటూ నిలదీశారు. -
బండరాయితో మోది..మహిళ దారుణ హత్య
మైలార్‌దేవ్‌పల్లి : మహిళను గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతంగా హత్య చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి పది గంటల ప్రాంతంలో శాస్త్రీపురం నిర్మాణుష్యా ప్రాంతంలోని జీహెచ్ఎంసీ పార్కులో మంటలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా మహిళ ముఖంపై బండరాయితో మోది హత్య చేసి ఉన్న ఆనవాళ్లు కనిపించాయి. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో వెంటనే పోలీసులు శాస్త్రీపురం చేరుకుని గుర్తు తెలియని మహిళ శవం ఫోటోలు తీసి రాత్రి నుంచి పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె ఆచూకీ కోసం వెతికారు. చివరకు శనివారం మధ్యాహ్నం మహిళ ఆరాంఘర్ గుడిసెల్లో నివాసం ఉండే తిరుపతి భార్య పద్మమ్మ(35)గా పోలీసులు గుర్తించారు. ఆరాతీయగా పోలీసులకు కొంత సమాచారం లభించింది. శుక్రవారం దానమ్మ హట్స్‌లోని కల్లు కాంపౌండ్‌లో తిరుపతి, పద్మమ్మ దంపతులతోపాటు తిరుపతి స్నేహితుడు శాస్త్రీపురంలో ఉండే విష్ణు.. ముగ్గురూ కలిసి కల్లు సేవించారు. తిరుగు ప్రయాణంలో విష్ణు శాస్త్రీపురంలోని ఇళ్లల్లో పని చూపిస్తానని చెప్పి పద్మమ్మను తీసుకెళ్లి రాఘవేంద్ర కాలనీ వద్ద దింపాడు. కాగా పద్మమ్మ భర్త ఇంటికి వెళ్లిపోయాడు. విష్ణుతో వెళ్లిన తన భార్య హత్య చేయబడిందని విష్ణుపై తనకు అనుమానం ఉందని తిరుపతి పోలీసులకు చెప్పాడు. రాఘవేంద్ర కాలనీ పార్కు వద్ద సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి శంషాబాద్ డీసీపీ పద్మజ, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్‌కుమార్, మైలార్‌దేవ్‌పల్లి సీఐ జగదీశ్వర్లు చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. -
భీమవరంవైపు వెళుతున్న బస్సుపై దాడి
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై వెళుతున్న బస్సును ఆపి రాళ్లతో దాడికి పాల్పడ్డ ఘటన కలకం రేపింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో చోటుచేసుకుంది. బీఎస్ఆర్ ట్రావెల్స్ కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు భీమవరంవైపు వెళ్తుండగా కైకలూరు బైపాస్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బస్సుపై రాళ్లు విసిరారు. ఊహించని ఈ దాడితో భయభ్రాంతులైన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం డ్రైవర్ బస్సును దగ్గరలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించాడు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వారిని వేరే బస్సులో ఎక్కించి పంపించేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. -
ప్రేమపెళ్లి కోసం వెళ్తే.. రాళ్లతో కొట్టి చంపారు
కాబూల్: అఫ్ఘానిస్తాన్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. మనసుకు నచ్చని పెళ్లిని వ్యతిరేకించిన ముస్లిం యువతిని రాళ్లతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అఫ్ఘాన్ మీడియా దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేయడంతో ఈ అమానుషం వెలుగు చూసింది. అఫ్ఘానిస్తాన్‌లోని రాక్ సహానా అనే ముస్లిం యువతికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ప్రియుడితో కలిసి పారిపోయి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయత్నించింది. అదే ఆమె చేసిన నేరం. తాలిబన్లు ఆమెపై తమ ప్రతాపాన్ని చూపించారు. ప్రియుడితో కలిసి వెళుతుండగా పట్టుకుని అతి దారుణంగా రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ మొత్తం వైనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు మీడియాలో బయటపడింది. దాదాపు 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో 20 ఏళ్ల వయసున్న రాక్ సహానా హృదయ విదారక రోదనలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అక్కడున్నవాళ్లంతా ఈ దృశ్యాలను చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేదు. ఆమెపై రాళ్లు విసురుతున్న శబ్దం, షహాదా అంటూ ఆమె పెట్టిన ఆర్తనాదాలు క్రమేపీ సన్నగిల్లడం ఈ వీడియోలో స్పష్టంగా ఉంది. ఆ అమానుషం గతవారం ఘర్ రాష్ట్రంలోచోటుచేసుకుందని స్థానిక మహిళా గవర్నర్ సీమ జోయేంద్ర తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నా, ఘర్ ప్రాంతంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మతపెద్దలు, ఇతర సాయుధుల సమక్షంలో ఆ యువతిని రాళ్లతో కొట్టి చంపారని ఆమె తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.