
‘ఎట్ హోం’లో మోడీ హవా..
68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం రాష్ట్రపతిభవన్‌లో విందు ఇచ్చారు. మోఘల్ గార్డెన్స్‌లో ఎట్‌హోం పేరుతో ఇచ్చిన ఈ విందులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
న్యూఢిల్లీ: 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం రాష్ట్రపతిభవన్‌లో విందు ఇచ్చారు. మోఘల్ గార్డెన్స్‌లో ఎట్‌హోం పేరుతో ఇచ్చిన ఈ విందులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. రక్షణ వలయాన్ని పట్టించుకోకుండా మోడీ అతిథులను పలకరిస్తూ.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. 63 ఏళ్ల నరేంద్రమోడీ ‘ఎట్‌హోం’ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎర్రకోటపై ప్రధానిగా మోడీ తొలి ప్రసంగాన్ని పలువురు అతిథులు కొనియాడారు. పలువురు మోడీ ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం పాటుపడాలని, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే అందరి భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, వివిధ దేశాల దౌత్యవేత్తలు, పలువురు వీవీఐపీలు పాల్గొన్నారు.