సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం సందడిగా జరిగింది. శీతాకాల విడిదికి విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 3 రోజులుగా హైదరాబాద్‌లో బస చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎంతో రాష్ట్రపతి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ కార్యక్ర మానికి వచ్చిన వారందరినీ రాష్ట్రపతి హృదయపూర్వకంగా పలకరించారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ దత్తాత్రేయ, సీఎల్పీ నేత జానారెడ్డి, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పలువురు ఎంపీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజకీయ నేతలతోపాటు సామాజిక, క్రీడా తదితర రంగాల ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులను రాష్ట్రపతి పలకరించారు.
Comments
Please login to add a commentAdd a comment