న్యూఢిల్లీ: ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఆన్‌లైన్ కోచింగ్ టీచర్ అవధ్ ఓజా ఈరోజు(సోమవారం) ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నారు. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అవధ్ ఓజా గతంలో బీజేపీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా, అది కుదరలేదు. ఇప్పుడు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నారు. అవధ్ ఓజా గోండా నివాసి. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వివిధ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
మనీష్ సిసోడియా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పట్పర్‌గంజ్ నుంచి అవధ్ ఓజా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానంలో బ్రాహ్మణ, గుర్జర్ ఓటర్లు అధికంగా ఉన్నారు. మనీష్ సిసోడియా ఈసారి జంగ్‌పురా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అవధ్ ఓజా రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో అవధ్ ఓజా మాట్లాడుతూ, తాను అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నానని, అయితే ఆ అవకాశం రాలేదన్నారు.
ఇది కూడా చదవండి: పెరిగిన ఏసీ రైళ్ల ట్రిప్పులు.. ప్రయాణికులకు తిప్పలు!
Comments
Please login to add a commentAdd a comment