సిమ్లా: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచిన కేజ్రీవాల్.. శనివారం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆప్ తలిపెట్టిన ర్యాలీలో కేజ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజలను, ఆమ్ ఆద్మీపార్టీని చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. అందుకే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు నిర‍్వహించేందుకు ప్రయత్నిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే ఓ కొత్త హిమాచల్‌ను ఆవిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ తెలిపారు. ఆప్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే సరికొత్త హిమాచల్‌ను చూపిస్తామని ప్రజలకు కోరారు. అలాగే, కాంగ్రెస్, బీజేపీ నేతలకు కేజ్రీవాల్ ఆఫర్ ఇచ్చారు. ఆయా పార్టీల్లో ఉన్న సచ్ఛీలురందరూ వెంటనే ఆప్‌లో చేరిపోవాలని కోరారు.
BJP हिमाचल और गुजरात में आम आदमी पार्टी से डरी हुई है। असल में ये AAP से नहीं, जनता से डरे हुए हैं।
— AAP (@AamAadmiParty) April 23, 2022
BJP ने तय किया है कि Himachal और Gujarat के चुनाव जल्द कराएंगे।
BJP चुनाव जब मर्ज़ी कराए, सत्ता आम आदमी के हाथ में आनी चाहिए।
-CM @ArvindKejriwal #HimachalMeinBhiKejriwal pic.twitter.com/8jvySkuvEr
మరోవైపు.. హిమాచల్‌లో ప్రత్యామ్నాయంగా పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని అన్నారు. ఇప్పుడు తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు. ఢిల్లీలో ప్రవేశపెట్టిన పథకాలకు హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరాం ఠాకూర్ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో తాము 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అని ప్రకటించగానే.. హిమాచల్ సీఎం ఠాకూర్ ఇక్కడ 125 యూనిట్ల వరకూ ఉచితమంటూ ప్రకటించారని అన్నారు.
ఇది చదవండి: పంజాబ్ సీఎం మరో కీలక నిర్ణయం..
Comments
Please login to add a commentAdd a comment