అహ్మదాబాద్: గుజరాత్‌లో ఎన్నికల వేళ ఈసారి ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ వాహనాన్ని కాంగ్రెస్ బయటకు లాగేందుకు సహకరిస్తోందా? అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సెటైర్ వేశారు. 182 స్థానాలున్న గుజరాత్‌లో డిసెంబర్ 01, 5 తేదిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఎన్నికల ప్రచార ర్యాలీ సమావేశాల్లో బిజీగా ఉన్నాయి. ఈ మేరకు బీజేపీ పోస్టర్లతో కూడిన ప్రచార ర్యాలీ వాహనం బురదలో ఇరుక్కుపోయింది. దీంతో ఈ వాహనాన్ని కాంగ్రెస్ ప్రచార వాహనం సాయం అందించి బయటకు తీసేందుకు యత్నించింది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ఎన్నికల్లో ఇరుక్కుపోయిన బీజేపీకి కాంగ్రెసే దిక్కు అంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల ఐఎల్‌యూ-ఐఎల్‌యూ(వాహనాల)ల కథ అంటూ కామెంట్లు చేస్తూ... ఆ ఘటనకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు.
गुजरात में भाजपा की अटकी हुई चुनावी गाड़ी को बचाने में पूरा ज़ोर लगाती कांग्रेस..
— AAP (@AamAadmiParty) November 12, 2022
ये है चुनावों में BJP और Congress के ILU-ILU की कहानी 🫶🏻💕 pic.twitter.com/nbBu7GjW6i
(చదవండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. టవర్ ఎక్కి ఆప్ నేత ఆత్మహత్యాయత్నం!)
Comments
Please login to add a commentAdd a comment