న్యూఢిల్లీ:ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ, స్వయంగా ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు.ఈ ఓటమి అంశం బీజేపీ నేతలకు అంతులేని ఆనందాన్నిచ్చింది. వారి సంబరాలకు కారణమైంది.ఎందుకంటే ఆప్‌పై గెలిచింది వారే.అయితే ఆప్‌తో ఎన్నికల్లో తలపడకుండా ఆప్ ఓటమి పట్ల బీజేపీ తర్వాత అంత సంతోషించింది ఒక్కరే. ఆమే..ఆప్ నుంచి సస్పెండైన రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్. ఢిలీ ఎన్నికల్లో ఆప్ ఓటమి నిర్ధారణ అయిన వెంటనే స్వాతి మలివాల్ తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం పోస్టు పెట్టారు.
— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, గతేడాది మేలో లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు.ఈ సమయంలో కేజ్రీవాల్‌ను కలవడానికి స్వాతి ఆయన నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కొద్ది సేపట్టికి స్వాతి అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేసిన తనపై కేజజ్రీవాల్ ఇంట్లో దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్‌కుమార్ తనను కొట్టాడని కేసు పెట్టారు. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.స్వాతి మలివాల్ జరిగిన దాడిని తొలుత ఖండించిన ఆప్ ఆ తర్వాత స్వాతి మలివాల్ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆరోపించింది. దీంతో స్వాతి మలివాల్ ఆప్, కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆప్ వ్యతిరేకంగా పలు చోట్ల ప్రచారం కూడా చేశారు. స్వాతిమలివాల్‌కు మద్దతుగా ఆప్ ఓటమిపై శనివారం మీమ్స్, పోస్టులు సోషల్‌మీడియాను ముంచెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment