![Mp Swati Maliwal Post On Delhi Cm Atishi Dance](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/Athisi%20dance.jpg.webp?itok=8KYpvSCx)
న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం అతిషిపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఫైరయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయినప్పటికీ సీఎం అతిషి మాత్రం కల్కాజి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
గెలిచిన సంతోషంలో అతిషి తన అనుచరులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను స్వాతి మలివాల్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. పార్టీ ఓడిపోయినా బాధలేదు కానీ తాను మాత్రం గెలిస్తే చాలన్నట్లు సీఎం అతిషి డ్యాన్సులేయడం ఏంటని మలివాల్ ఎద్దేవా చేశారు.
పార్టీ ఓడిపోయింది.ఆప్ ముఖ్య నేతలంతా ఓడిపోయారు.అయినా అతిషి ఇలా వేడుక చేసుకుంటున్నారు అని వీడియోను ఉద్దేశించి మలివాల్ విమర్శించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అతిషి 3521 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై గెలుపొందారు.
ये कैसा बेशर्मी का प्रदर्शन है ? पार्टी हार गई, सब बड़े नेता हार गये और Atishi Marlena ऐसे जश्न मना रही हैं ?? pic.twitter.com/zbRvooE6FY
— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025
ఈ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి పార్టీ సీనియర్ నేతలంతా ఓటమి పాలయ్యారు.27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకుంది.
కాగా, అతిషి ఆదివారం(ఫిబ్రవరి 9) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎల్జీ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే దాకా పదవిలో కొనసాగాలని ఎల్జీ అతిషిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment