న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ((Delhi Assembly Election 2025) ాభాగంగా తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ నేతల భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ((AAP) నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు. ఆప్ కార్యకర్తలను భయపెట్టడమే కాకుండా దాడులు సైతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికి ఆమె లేఖ రాశారు. ప్రధానంగా బీజేపీ(BJP) ఎంపీ రమేష్ బిధురి మేనల్లుడు తమ కార్యకర్తలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాడని ఆమె లేఖ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఇంట్లో కూర్చోకపోతే.. కాళ్లు చేతులు విరిచేస్తారట..!
ఢిల్లీ సీఎం అతిషి.. ఈసీకి ఫిర్యాదు చేసిన ాదాని ప్రకారం.. ‘ఇవి తమ ఎన్నికలని, ఇంట్లో కూర్చోకుండా బయటకుస్తే కాళ్లు, చేతులువిరిచేస్తామని ఆప్ కార్యకర్తలకు బీజేపీ నేతలు వార్నింగ్ ఇచ్చినట్లు అతిషి ేపేర్కొన్నారు.
ఫిబ్రవరి 5న ఎన్నికలు.. 8వ తేదీన ఫలితాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 5వ ేతేదీన జరుగనున్నాయి. ఇంకా సుమారు ెరెండు వారాల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మళ్లీ ెగెలిచేందుకు ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠంపై తామే కూర్చోవాలని బీజేపీ సైతం గట్టిగా పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఇరు పార్టీల మధ్య తీవ్ర ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎక్కడా కూడా ఇరు పార్టీలు తగ్గేదేలే అన్నట్లు తమ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
అది కేజ్రీవాల్ పనే .. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార ఆమ్ ఆద్మీపార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో తమదైన రీతిలో దూసుకుపోతున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
డిల్లీలో ఓడిపోతామన్న భయంతో ఆప్ ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు దిగుతుందని ఆరోపించారు. దీనిలో భాగంగానే ఆప్ నేతలు.. ఢిల్లీ ఓటర్లకు కుర్చీలు పంచి పెడుతున్నారని పర్వేష్ వర్మ మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ని ఆప్ ఉల్లంఘిస్తుందని పోలీసులకు, ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతలు స్థానికంగా ఉన్న ఓటర్లకు కుర్చీలు పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పర్వేష్‌వర్మ ఎన్నికల ఏజెంట్ సందీప్ సింగ్ చేత ఫిర్యాదు చేయించారు పర్వేష్ వర్మ.
Comments
Please login to add a commentAdd a comment