సాక్షి, అమరావతి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నట్టు మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.
కేబినెట్ భేటీ అనంతరం, మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. బీర్, లిక్కర్ అమ్మకాలు తగ్గిపోవడంతో 18వేల కోట్ల నష్టం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మెరుగైన బ్రాండ్లు అందుబాటులోకి తెస్తాం. అందరికీ అందుబాటులో ఉన్న ధరలకు మద్యం తీసుకొస్తామన్నారు.
అలాగే, భూములపై రెవెన్యూ గ్రామ సభలను మూడు నెలల పాటు నిర్వహిస్తాం. అందులో భాగంగానే మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్టు తెలిపారు. అలాగే, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన 217, 144 జీవోలు రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment