Kolusu Parthasarathi
-
గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గాయి: మంత్రి పార్థసారథి
సాక్షి, అమరావతి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నట్టు మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.కేబినెట్ భేటీ అనంతరం, మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. బీర్, లిక్కర్ అమ్మకాలు తగ్గిపోవడంతో 18వేల కోట్ల నష్టం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మెరుగైన బ్రాండ్లు అందుబాటులోకి తెస్తాం. అందరికీ అందుబాటులో ఉన్న ధరలకు మద్యం తీసుకొస్తామన్నారు.అలాగే, భూములపై రెవెన్యూ గ్రామ సభలను మూడు నెలల పాటు నిర్వహిస్తాం. అందులో భాగంగానే మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్టు తెలిపారు. అలాగే, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన 217, 144 జీవోలు రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. -
చంద్రబాబుపై కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు
-
అజ్ఞానానికి బ్రాండ్ అంబాసిడర్ లోకేష్..
సాక్షి, విజయవాడ: సంక్షేమ పథకాల గురించి మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి ఎద్దేవా చేశారు. ఆయన సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ‘అధికారం పోయాక లోకేష్‌కు పిచ్చి బాగా ముదిరింది. విషయ పరిజ్ఙానం లేకుండా మాట్లాడుతున్నారు. లోకేష్ హడావుడిగా తన అజ్ఞానాన్ని బైటపెట్టుకున్నారు. చంద్రబాబు పథకాలు కొనసాగిస్తామని మేము ఎక్కడైనా చెప్పామా..?. ప్రజలకు పనికి వచ్చే పథకం చంద్రబాబు ఒకటైన పెట్టారా.. నారా లోకేష్‌కు టీడీపీలో అధ్యక్ష పదవికి పోటీ వచ్చినట్టున్నారు. అందుకే తన అజ్ఞానంతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. (మూడు విడతల్లో సర్వే చేయండి: సీఎం జగన్) వైఎస్సార్ రైతు భరోసా కాపీ కొట్టమని సిగ్గులేకుండా లోకేష్ మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్లీనరీలో రైతు భరోసా పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అదే చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో లబ్ధిదారులను వేధించారు. సంక్షేమ పథకాలపై విమర్శలు చేస్తున్న నారా లోకేష్ కుప్పంలోనైనా, మంగళగిరిలోనైనా చర్చకు సిద్ధమా?. ఆయన స్పందించకుంటే తోక ముడిచినట్లే. ఐదేళ్లు సంక్షేమాన్ని పట్టించుకోకుండా.. ఎన్నికల ముందు చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని పెట్టారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే లోకేష్ దాన్ని కుంభకోణం అంటున్నారు. పేదలపై ఆయనకు ఎంత వ్యతిరేక భావం ఉందో ఆయన ప్రకటనతో అర్థమవుతుంది. (అనితారాణి ఆరోపణలు: విచారణకు సీఎం జగన్ ఆదేశం) దిశ చట్టానికి, బిల్లుకు తేడా తెలియని అజ్ఞాని లోకేష్. అబద్ధానికి, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అయితే అజ్ఞానికి బ్రాండ్ అంబాసిడర్ లోకేష్. లోకేష్ ఉంటే పార్టీ మునిగిపోతుందని టీడీపీ కార్యకర్తలే అనుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. బీసీల తోకలు కత్తిరిస్తాం, తోలు తీస్తామంటూ అవమానించారు. మద్యపాన నిషేధానికి చంద్రబాబు పూర్తి వ్యతిరేకి. ఎన్టీఆర్ మద్యపానాన్ని నిషేధిస్తే..చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఇంటింటికీ మద్యాన్ని తీసుకెళ్లారు’ అని మండిపడ్డారు. -
‘చంద్రబాబు జీవితం మొత్తం డ్రామాలే’
సాక్షి, విజయవాడ : ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన స్థలంలో సాగిలపడి చంద్రబాబు నాయుడు నటిస్తున్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విమర్శించారు. గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబు సాష్టాంగ నమస్కారం చేయాల్సింది మట్టికి కాదని.. రైతులకని హితవు పలికారు. ఈ అయిదేళ్లలో ఏ రోజు ఆలోచించని బాబు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసి 33 వేల ఎకరాలు దోచేందుకు ప్లాన్ చేశాడని మండిపడ్డారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రైతులిచ్చిన భూములను సింగపూర్ కంపెనీలకు, ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారని, ఏ హక్కు ఉందని ఆ భూములను ప్రైవేటు వారికి దానం చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. ‘అమరావతి పర్యటనలో తనపై చెప్పులు, రాళ్లు వేశారంటున్నారు. కానీ రైతులకు న్యాయం చేసి ఉంటే అలా చేసి ఉండేవారా’ అని నిలదీశారు. దళిత శాసన సభ్యులకు ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టలేని చంద్రబాబు ఇక్కడ కూడా వారిని అన్యాయం చేశారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. అదే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. ప్రస్తుతం బాబును అడ్డుకునే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబులా మాయలు చేసే నైజాం తమది కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితం మొత్తం డ్రామాలేనని విమర్శించారు. ఇసుక అందుబాటులోకి వచ్చే సమయంలో నిరహార దీక్ష చేశాడని ఎద్దేవా చేశారు. రాజధాని పేరిట అమరావతిలో బాబు ఖర్చు పెట్టింది అయిదారు వేల కోట్లు మాత్రమేనని, రాజధాని మొత్తం కట్టినట్లు బిల్డప్ ఇస్తున్నాడని అన్నారు. అన్ని సెట్టింగులు, గ్రాఫిక్స్‌తో కాలం గడిపాడిన బాబు అయిదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీశాడని మండిపడ్డారు. -
ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటిస్తూ.. సహాయక చర్యల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పెనమలూరు నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలను పరిశీలించారు. సహాయక చర్యల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచి నీటి సమస్య, శానిటేషన్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో పశువులకు గడ్డి ఏర్పాటుతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా వాక్సినేషన్ టీకాలు వేయ్యాలన్నారు. ముంపు ప్రాంతాల్లో దొంగతనాలు జరగకుండా పోలీసుల గస్తీ ఏర్పాటు చేయాలని పార్థసారథి అధికారులను ఆదేశించారు. వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. నష్టపోయిన రైతన్నను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించడంలో అధికారులు బాగా కృషి చేశారని పార్థసారథి ప్రశంసించారు. నందిగామలో పర్యటించిన జగన్మోహన్ రావు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు కంచికచెర్ల, చందర్లపాడు మండలాల్లో పర్యటించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద ముంపు ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని.. ఏవైనా సమస్యలు ఉంటే (9493530303) కాల్ సెంటర్ నంబర్‌కు కాల్ చేయమని చెప్పారు. అవనిగడ్డలో పర్యటించిన ఎమ్మెల్యేలు అవనిగడ్డలోని ఎడ్లలంక, చిరువోలంక, బొబ్బర్లంక, కొత్తపాలెం, ఆముదాలంక గ్రామాల్లో ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్ బాబు, ఎంవీఎస్ నాగిరెడ్డి పర్యటించారు. ముంపు గ్రామల ప్రజలను పునరావాస కేంద్రాల వద్దకు తరలించి వారికి భోజనంతో పాటు, మెడికల్ సహాయ చర్యలు అందించారు. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక డీఎస్పీ, సీఐ, ఎస్సైలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జేసీ మాదవీలత, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఎన్డీఆర్ ఎఫ్ బోటులో కృష్ణా నది దాటి తోట్లవల్లూరు మండలం పాములలంకకు వెళ్లారు. ఆ గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిరావాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్-2 మోహన్ కుమార్, వైయస్ఆర్ సీపీ యువనేత సామినేని ప్రశాంత్ బాబు జగ్గయ్యపేట మండలం రావిరాల, ముక్త్యాల గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. -
వైఎస్సార్సీపీ రైతు పక్షపాతి : పార్థసారథి
సాక్షి, పెనమలూరు : రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. నియోజకవర్గంలోని ఉయ్యూరులో ఎమ్మెల్యే రైతుబజార్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, అలాగే డ్వాక్రా మహిళలకు కూడా వడ్డీలేని రుణాలు ఇచ్చి అక్కాచెల్లెళ్లకు చేయూతగా నిలిచి వారు ఆర్థికంగా ఎదగడానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామ వలంటీర్ల పేరుతో లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని గుర్తుచేశారు. మా ప్రభుత్వం అసెంబ్లీలో చారిత్రాత్మకమైన బిల్లులను ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ స్వాగతించకపోగా సభను అడ్డుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజాశ్రేయస్సుకోరే బిల్లులను మేం ప్రవేశపెట్టడాన్ని జీర్ణించుకోలేకే సభలో గందరగోళ వాతావరణం సృష్టించారని ఎద్దేవా చేశారు. వారికి మాట్లాడడానికి తగిన సమయం ఇచ్చినప్పటికి కూడా సభా సమయాన్ని దుర్వినియోగం చేసి ప్రజా సమస్యలపై చర్చ జరగకకుండా అడ్డుపడ్డారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని అవరోధాలు సృష్టించినా జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని స్పష్టం చేశారు. -
‘బడ్జెట్లో.. రుణమాఫీ రూ. 8300 కోట్ల ప్రస్తావనే లేదు’
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జవాబుదారీతనం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శించారు. మంగళవారం విజయవాడలో విలేరులతో మాట్లాడుతూ.. రైతులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. రైతు సుఖీభవ పేరుతో కేటాయించిన రూ. 5 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారో అన్న విషయంపై స్పష్టత లేదని విమర్శించారు. రైతులకు రెండు విడతల్లో చెల్లించాల్సిన రుణమాఫీ రూ. 8300 కోట్ల ప్రస్తావనే బడ్జెట్లో లేదన్నారు. మూలనిధికి కేటాయింపులు లేవు.. ‘బీసీ సబ్ ప్లాన్ కోసం రూ. 50 వేల కోట్లు అన్నారు. గడిచిన నాలుగు బడ్జెట్ సంవత్సరాల్లో ఖర్చు చేసింది రూ.16 వేల కోట్లు మాత్రమే . ప్రతీ కులానికి కార్పొరేషన్ అని సీఎం ప్రకటించారు . అయితే ఆయా కార్పోరేషన్ల మూలనిధికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. నిరుద్యోగభృతి కోసం గత బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించి రూ. 116 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ సారి భృతి రెట్టింపు చేస్తామంటూ కేవలం రూ.1200 కోట్లే ఎలా కేటాయిస్తారు’ అని పార్థసారథి ప్రశ్నించారు. ఇది పూర్తిగా మోసపూరిత బడ్జెట్ అని దుయ్యబట్టారు. కాగా మంగళవారం ఉదయం 11:45 గంటలకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల వేళ సంప్రదాయబద్ధంగా ఓటాన్ అకౌంట్ (మధ్యంతర) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాల్సిన ప్రభుత్వం.. రాజ్యాంగానికి విరుద్ధంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీ ముందు ఉంచిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్థోమతకు మించి అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో కూడా అప్పులతోపాటు రాని ఆదాయ వనరులను చూపిస్తూ కాగితాలపై భారీగా కేటాయింపులు చేసింది. రూ.2,26,177.53 కోట్ల కేటాయింపులతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను యనమల ప్రవేశపెట్టారు. ఆదాయ వనరులు లేకపోయినా.. ఎన్నికల ముందు ఊహాజనిత గణాంకాలతో భారీగా బడ్జెట్ కేటాయింపులు చేసేద్దామనే రీతిలో సర్కారు వ్యవహరిస్తోంది. రూ.2099.47 కోట్లను రెవిన్యూ లోటు కింద.. రూ.32,390 కోట్లను ద్రవ్యలోటు కింద బడ్జెట్లో పేర్కొన్నారు. -
ఇది ఓటమి భయంతో పెట్టిన బడ్జెట్ : పార్థసారథి
-
తప్పులు కప్పిపుచ్చుకునేందుకే శ్వేతపత్రాల డ్రామా
సాక్షి, హైదరాబాద్: తన తప్పులు, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు శ్వేతపత్రాల డ్రామా మొదలెట్టారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన మాటలు చూస్తుంటే.. అధికారం కోల్పోతున్నామనే భయం పట్టిన్నట్లుగా ఉందన్నారు. అందుకే పండుగలు, పబ్బాలు లేకుండా శ్వేతపత్రాల పేరుతో ఇష్టానుసారంగా పేజీలకుపేజీలు అబద్ధాలు తీసుకొచ్చి కుమ్మరిస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతను విమర్శించడం.. లేదంటే ఎవరో ఒకరి కాళ్లు పట్టుకుని మళ్లీ అధికారంలోకి ఎలా రావాలనే ఆలోచన తప్ప చంద్రబాబు చేస్తుందేమీ లేదన్నారు. లోకేశ్‌పై ఉన్న కోపాన్ని చంద్రబాబు బహుశా వైఎస్ జగన్‌పై చూపిస్తున్నట్లుగా ఉందని పార్థసారథి అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు అంటున్నట్లుగా లోకేశ్ ఏ పంచాయతీ పదవుల్లో లేరని.. మరి ఆయన్ని నేరుగా ఎలా మంత్రిని చేశారని ప్రశ్నించారు. ఏదో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నట్లు అర్థశాస్త్రమంతా తనకే తెలుసునని చంద్రబాబు మాట్లాడుతున్నారని.. మరి అంత తెలిసుంటే ప్రతి నెలాఖరుకు రిజర్వ్ బ్యాంకు వద్దకు వెళ్లి ఓడీ తీసుకుని జీతాలు చెల్లించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇంత రెవెన్యూ లోటు చూడలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి రూ.90 వేల కోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారని.. మరి నాలుగేళ్లుగా ఎన్డీయేతో కలిసి ఉన్నపుడు ఈ విషయంపై ఎందుకు ప్రశ్నించలేదని పార్థసారథి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీ కావాలని కేంద్రంతో లాలూచీ పడిందే చంద్రబాబు అని ఎండగట్టారు. ప్యాకేజీని ఆహ్వానిస్తూ మోదీని అభినందిస్తూ తీర్మానం ఎందుకు చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా రైతుల ఆదాయం రెట్టింపైతే.. మరి ప్రతిరోజూ గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వార్తలు ఎందుకొస్తున్నాయని నిలదీశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.వెయ్యి నుంచి రూ.1,100కు అమ్మిన ధాన్యం.. ఇన్నేళ్ల తర్వాత ఇంకా రూ.1,300కు అతి కష్టం మీద అమ్ముతుండే రైతుల ఆదాయం ఎలా రెట్టింపయ్యిందని ప్రశ్నించారు. అలాగే చెరుకుకు 2014లో రూ.1,700 నుంచి రూ.1,800 ధర లభిస్తే ఇవాళ రూ.2వేల నుంచి రూ.2,100 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో మాత్రమే నూరు శాతం రుణమాఫీ జరిగిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందేనన్నారు. చంద్రబాబులా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడం జగన్‌కు తెలియదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు సోషియాలజీ, అర్ధశాస్త్రం తెలియడం వల్లే అమ్మ ఒడి పథకం తెస్తున్నారని, 108, 104 సర్వీసులను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు రూ.వెయ్యి ఖర్చు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేరుస్తానని ప్రకటించారన్నారు. -
హాయ్‌లాండ్ ఆస్తులు దోచకోవడానికి కుట్ర
-
‘బాధితుల జాబితాను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు?’
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు పార్థసారథి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. 1100 కోట్ల రూపాయలు చెల్లిస్తే.. 16 లక్షల కుటుంబాలకు ఊరట లభిస్తుందని తెలిపారు. విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేస్తున్న చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. చంద్రబాబు సర్కార్‌కు ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన లేదన్నారు. హాయ్‌లాండ్ విషయంలో బాధితులను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే 1100 కోట్ల రూపాయలు చెల్లించి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. హాయ్‌లాండ్ ఆస్తులు దోచకోవడానికి కుట్ర వైఎఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. 206 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వంలో కదలిక లేదని మండిపడ్డారు. సీబీసీఐడీ ద్వారా బాధితులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పటివరకు ఎంతమందికి నష్ట పరిహారం ఇచ్చిందని ప్రశ్నించారు. హాయ్‌లాండ్ ఆస్తులను దోచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం వారిని ఆదుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు. బాధితుల జాబితాను బహిర్గతం చేయాలని కోరినప్పటికీ.. ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని ప్రశ్నించారు. ఆదివారం ఉదయం 13 జిల్లాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం కానున్నట్టు తెలిపారు. వారితో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. బాధితులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. బాధితుల ఆర్తనాదాలు కనిపించడం లేదా? వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్గిగా విఫలమైందని మండిపడ్డారు. బాధితుల ఆత్మహత్యలు, ఆర్తనాదాలు చంద్రబాబుకు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందని తెలిపారు. -
‘వారి మాటల్లో కసి, ఓర్వలేనితనం కన్పిస్తున్నాయి’
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖలో హత్యాయత్నం జరిగిన ఘటనపై టీడీపీ నేతల మాటల తీరులో కసి, ఓర్వలేనితనం స్పష్టంగా కన్పిస్తున్నాయని వైఎస్సార్ సీసీ నేత కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటూ, నేర ప్రవృత్తి కలిగిన టీడీపీ నేతలు క్రూర మృగాల్లా మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను కనీసం పరామర్శించే హుందాతనం లేని సీఎం చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల నేతలు ఆయనను పరామర్శిస్తే ఓర్చుకోలేక పోతున్నారని విమర్శించారు. అబద్ధపు హామీల నుంచి బయట పడటానికి, ప్రజల దృష్టి మరల్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇంకా మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడ నిజమేనేమోనన్న బాబు వ్యాఖ్యలు వింటుంటే.. దాన్ని రచించింది చంద్రబాబేనన్న అనుమానం తమకూ కలుగుతోందన్నారు. ఒకవేళ ఆయనకు ముందుగానే ముఖ్యనేతపై దాడి జరుగుతుందని తెలిసి ఉంటే ప్రభుత్వం తరపున చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. నిష్పక్షపాత విచారణ కావాలి.. మధ్యాహ్నం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే సాయంత్రం 4.30 గంటల వరకు తనకు సమాచారం లేదని సీఎం అంటారు.. కానీ 2 గంటలకే డీజీపీ ఈ ఘటనపై మాట్లాడతారు. అయినా విచారణ జరపకముందే నిందితుని మానసిక స్థితి సరిగా లేదని డీజీపీ ఎలా చెబుతారంటూ పార్థసారథి ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం ఉంది గానీ.. ఈ సంఘటనలు చూస్తుంటే ఆ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తుల మీద అనుమానం కలుగుతోందన్నారు. విచారణను పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందుకే ఈ విషయంలో జోక్యం చేసుకుని నిష్పక్షపాత విచారణ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిని కోరతామని పార్థసారథి తెలిపారు. -
టీడీపీ సర్కార్ క్యాన్సర్‌లా పట్టుకుంది: పార్థసారథి
సాక్షి, విజయవాడ : టీడీపీ సర్కార్ రాష్ట్రానికి క్యాన్సర్ జబ్బులా పట్టుకుందని, ఆర్థికంగా అతలాకుతలం చేస్తోందని వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారథి దుయ్యబట్టారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థిక వనరుగా మార్చుకుని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. స్వలాభం కోసం విభజన హామీలను తాకట్టు పెట్టారని, అప్పుల అప్పారావుగా మారి రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ముంచేస్తున్నారని మండిపడ్డారు. బాబు దోచుకున్న సొమ్మునే బాండ్ల రూపంలో ఇన్వెస్టర్ల పేరుతో కొంటున్నారని, సీఆర్డీఏ ఆర్థికంగా బలంగా ఉంటే ఎందుకు బాండ్లు ఇవ్వాల్సి వస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారం ఎవరు మోస్తారని నిలదీశారు. మంత్రుల ఛాంబర్లలోకి నీళ్లు ఎలా వచ్చాయని, మంత్రులే పైపులు కోశారా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడటంలో విఫలమైందన్నారు. అందుకే అందినకాడికి దోచుకుందాం అనే ఆలోచనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ కమిటీలో లోకేశ్‌కు స్థానమా?
వైఎస్సార్సీపీ నేత కొలుసు పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్: సీనియర్ మంత్రులు ఉండాల్సిన భూ కేటాయింపుల కమిటీలో ఏ అర్హత ఉందని లోకేశ్‌కు స్థానం కల్పిస్తారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు గద్దె నెక్కిన నాటి నుంచీ తన కుమారుడు లోకేశ్‌ను ఎలా ప్రమోట్ చేయాలనే తాపత్రయంతోనే పని చేస్తున్నారని, ఆయనకు ఏ మాత్రం ప్రజాస్వామ్య విలువలు లేవని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ లోకేశ్‌ను 2015 సెప్టెంబర్ 30న టీడీపీ జాతీయ కార్యదర్శిగా చేశారని, ఈ ఏడాది మార్చి 30న ఎమ్మెల్సీ చేశారన్నారు. ఆ తర్వాత రెండు రోజులకే మంత్రిని చేశారని, ఇపుడు నెల రోజులకే సీనియర్ మంత్రులుండాల్సిన కమిటీలో ఆయన్ను సభ్యుడిగా చేశారంటే బాబుకు తన కుమారుడి పట్ల ఆరాటం కనిపిస్తోందన్నారు. పెట్టుబడిదారులకు భూపందేరం కోసమే ఇలా చేశారని దుయ్యబట్టారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కనుకనే ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తిని కమిటీ నుంచి పక్కన బెట్టారా? అని అనుమానం వ్యక్తం చేశారు.