సాక్షి, విజయవాడ: సంక్షేమ పథకాల గురించి మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి ఎద్దేవా చేశారు. ఆయన సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ‘అధికారం పోయాక లోకేష్‌కు పిచ్చి బాగా ముదిరింది. విషయ పరిజ్ఙానం లేకుండా మాట్లాడుతున్నారు. లోకేష్ హడావుడిగా తన అజ్ఞానాన్ని బైటపెట్టుకున్నారు. చంద్రబాబు పథకాలు కొనసాగిస్తామని మేము ఎక్కడైనా చెప్పామా..?. ప్రజలకు పనికి వచ్చే పథకం చంద్రబాబు ఒకటైన పెట్టారా.. నారా లోకేష్‌కు టీడీపీలో అధ్యక్ష పదవికి పోటీ వచ్చినట్టున్నారు. అందుకే తన అజ్ఞానంతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. (మూడు విడతల్లో సర్వే చేయండి: సీఎం జగన్)
వైఎస్సార్ రైతు భరోసా కాపీ కొట్టమని సిగ్గులేకుండా లోకేష్ మాట్లాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో రైతు భరోసా పథకాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అదే చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో లబ్ధిదారులను వేధించారు. సంక్షేమ పథకాలపై విమర్శలు చేస్తున్న నారా లోకేష్ కుప్పంలోనైనా, మంగళగిరిలోనైనా చర్చకు సిద్ధమా?. ఆయన స్పందించకుంటే తోక ముడిచినట్లే. ఐదేళ్లు సంక్షేమాన్ని పట్టించుకోకుండా.. ఎన్నికల ముందు చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని పెట్టారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే లోకేష్ దాన్ని కుంభకోణం అంటున్నారు. పేదలపై ఆయనకు ఎంత వ్యతిరేక భావం ఉందో ఆయన ప్రకటనతో అర్థమవుతుంది. (అనితారాణి ఆరోపణలు: విచారణకు సీఎం జగన్ ఆదేశం)
దిశ చట్టానికి, బిల్లుకు తేడా తెలియని అజ్ఞాని లోకేష్. అబద్ధానికి, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అయితే అజ్ఞానికి బ్రాండ్ అంబాసిడర్ లోకేష్. లోకేష్ ఉంటే పార్టీ మునిగిపోతుందని టీడీపీ కార్యకర్తలే అనుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. బీసీల తోకలు కత్తిరిస్తాం, తోలు తీస్తామంటూ అవమానించారు. మద్యపాన నిషేధానికి చంద్రబాబు పూర్తి వ్యతిరేకి. ఎన్‌టీఆర్ మద్యపానాన్ని నిషేధిస్తే..చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఇంటింటికీ మద్యాన్ని తీసుకెళ్లారు’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment