ఆదిలాబాద్ : ప్రజలు నీళ్లు కావాలి మొర్రో అంటే మద్యం తాగండి అన్నట్లుగా టీఆర్ఎస్ సర్కారు తీరు ఉందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి ఎద్దేవా చేశారు. బుధవారం అదిలాబాద్ జిల్లా మందమర్రిలోని కమ్యూనిటీ హల్‌లో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ... ఓ వైపు తాగడానికి మంచినీళ్లు లేక జనం అలమటిస్తుంటే నూతన మద్యం, సర్కారు చీపులిక్కరు... గుడుంబా కంటే చాలా మంచిదంటూ ప్రభుత్వం ప్రచారం చేయడం హస్యాస్పదమని జ్యోతి ఆరోపించారు.
ప్రజలకు కావాల్సింది మంచినీరే కానీ మద్యం కాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించి బంగారు తెలంగాణ నిర్మించుకుందామన్న సీఎం కేసీఆర్ చివరకు తెలంగాణను మద్యంలో ముంచెత్తాలని చేస్తున్నారని జ్యోతి విమర్శించారు.