jyothy
-
MR Jyothy: తండ్రి మెచ్చిన తనయ
ఎంబీఏ చేసిన ఎంఆర్ జ్యోతి వ్యాపార పాఠాలను కళాశాలలో కంటే తండ్రి రామచంద్రన్ అడుగు జాడల్లో నుంచే ఎక్కువగా నేర్చుకుంది. అయిదువేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన ‘జ్యోతి ల్యాబ్స్’ను వేల కోట్ల టర్నోవర్‌కి తీసుకువెళ్లాడు ఎంపీ రామచంద్రన్. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి కంపెనీని మరోస్థాయికి తీసుకువెళుతోంది. ‘తండ్రి మెచ్చిన తనయ’ అనిపించుకుంది... తండ్రి అయిదు వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు జ్యోతి వయసు అయిదు సంవత్సరాలు. త్రిసూర్ (కేరళ)లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తండ్రి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎంత కష్టపడ్డాడో జ్యోతికి కళ్లకు కట్టినట్లుగా గుర్తుంది. అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముకున్న తండ్రి ఇటుకా ఇటుకా పేర్చి కంపెనీని బలోపేతం చేశాడు. సెలవు అంటూ లేకుండా వారానికి ఏడు రోజులూ పనిచేసేవాడు. ప్రాడక్ట్స్ లోడింగ్ నుంచి పత్రికలకు ఇచ్చే అడ్వరైజ్మెంట్ల వరకు అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. సింగిల్ ప్రాడక్ట్ ‘ఉజాల’తో మొదలైన కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘జ్యోతి ల్యాబ్స్’ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కంపెనీ మొదలు పెట్టిన కొత్తలో ఆరుగురు మహిళల బృందం ఇంటింటికీ తిరిగి ‘ఉజాల’ అమ్మేవారు. కట్ చేస్తే... 2005లో కంపెనీ మార్కెటింగ్ విభాగంలో చేరింది జ్యోతి. ఆ తరువాత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. 2020లో కంపెనీ ఎండీగా బాధ్యతలు స్వీకరించింది. బాధ్యతలు చేపట్టడానికి ముందు తరువాత అనే విషయాకి వస్తే ఎండీగా కంపెనీ ఆదాయాన్ని పెంచింది. నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీని మరో స్థాయికి తీసుకువెళ్లడానికి రెండో తరం ఎంటర్ ప్రెన్యూర్ అయిన జ్యోతి నిర్మాణాత్మకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మార్కెట్లో ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రాడక్ట్ ఇన్నోవేషన్స్. అడ్వర్టైజింగ్ ప్లాన్స్ వరకు ఎన్నో విషయాలపై దృష్టి పెట్టింది. కంపెనీ ప్రధాన ఆధారం... ఫ్యాబ్రిక్ కేర్, డిష్ వాషింగ్ ప్రాడక్ట్స్. ఈ నేపథ్యంలో పర్సనల్ కేర్ సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది జ్యోతి. గత సంవత్సరం కంపెనీ మార్గో సోప్ మూడు వేరియంట్స్‌ను లాంచ్ చేసింది. పర్సనల్ కేర్‌కు సంబంధించి ఇతర విభాగాలను కూడా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కంపెనీ. బహుళజాతి సంస్థల నుంచి పోటీ తట్టుకొని మార్కెట్లో ఛాలెంజర్ బ్రాండ్‌గా నిలవడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. ‘ఇక తిరుగులేదు’ అంటూ ఆ ఆత్మవిశ్వాసం ఎక్కువైతే మార్కెట్లో ఒక్కో మెట్టు కిందకు దిగక తప్పదు. అందుకే ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకుంది జ్యోతి. గతంలోలాగా భవిష్యత్ ఉండకపోవచ్చు. భారీ సవాళ్లు ఎదురు కావచ్చు. జ్యోతి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. దార్శనిక దృష్టితో ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంది. కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ విభాగంలో చేరిన కొత్తలో తండ్రితో కలిసి దేశవ్యాప్తంగా డిస్టిబ్యూటర్లు, రిటైలర్లు, స్టేక్‌హోల్డర్స్‌కు సంబంధించి ఎన్నో మీటింగ్‌లలో పాల్గొంది. ప్రతి మీటింగ్ ఒక పాఠశాలగా మారి తనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది. ‘గతమెంతో ఘనకీర్తి’ అని గతంలోనే ఉండిపోకుండా ‘ట్యూన్ విత్ ది చేంజింగ్ టైమ్స్’ అంటున్న జ్యోతి కొత్త టెక్నాలజీని పరిచయం చేయడం (ఉదా: రియల్–టైమ్ డేటాను ఉపయోగించడం) ఆటోమేటింగ్ ప్రాసెస్, ఓపెన్ డోర్ కల్చర్ వరకు ఎన్నో ఆధునిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ కాలంతో గొంతు కలుపుతూనే ఉంది. గెలుపుదారిలో కొత్త ఉత్సాహంతో ప్రయాణిస్తూనే ఉంది. -
జ్యోతి ల్యాబ్స్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 35 శాతం జంప్‌చేసి రూ. 37 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 27 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం ఎగసి రూ. 547 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 15 శాతం పెరిగి రూ. 508 కోట్లను తాకాయి. వాటాదారులకు షేరుకి రూ. 2.5 చొప్పున డివిడెండు ప్రకటించింది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి జ్యోతి ల్యాబ్స్ నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 159 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 191 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు మాత్రం 15 శాతంపైగా వృద్ధితో రూ. 2,196 కోట్లను అధిగమించాయి. ఫలితాల నేపథ్యంలో జ్యోతి ల్యాబ్స్ షేరు బీఎస్ఈలో 1.5 శాతం బలపడి రూ. 150 వద్ద ముగిసింది. -
ఆ రికార్డు ఈరోజు బద్దలైంది: సచిన్
ముంబై: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘బార్బర్ షాప్ గాల్స్’ జ్యోతికుమారి, నేహలను కలుసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు అబ్బాయిల్లా మారి సెలూన్ నడిపిస్తున్న వీరికి జిల్లెట్ స్కాలర్షిప్ను సచిన్ అందజేశారు. అంతేకాదు వారితో స్వయంగా షేవింగ్ చేయించుకుని మురిసిపోయారు. ఈ ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. (చదవండి: నాన్నకు వారసులు) ‘ఎవరి ముందు షేవింగ్ చేయించుకోవడానికి నేను ఇష్టపడను. కానీ ఈరోజు రికార్డు చెరిగిపోయింది. జ్యోతికుమారి, నేహలను కలుసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. వీరికి జిల్లెట్ స్కాలర్షిప్ అందజేశాన’ని సచిన్ ట్వీట్ చేశారు. గోరఖ్‌పూర్ నగరానికి సమీపంలోని భన్వారీతోలి గ్రామానికి చెందిన జ్యోతి, నేహ జీవన పోరాటం గురించి మీడియాలో ప్రముఖంగా రావడంతో జిల్లెట్ సంస్థ వీరిని ఆదుకునేందుకు వచ్చింది. వీరిద్దరిపై లఘు చిత్రాన్ని కూడా రూపొందించింది. A First for me! You may not know this, but I have never gotten a shave from someone else before. That record has been shattered today. Such an honour to meet the #BarbershopGirls and present them the @GilletteIndia Scholarship.#ShavingStereotypes#DreamsDontDiscriminate pic.twitter.com/DNmA8iRYsb — Sachin Tendulkar (@sachin_rt) May 3, 2019 -
జ్యోతి హత్యకేసులో ప్రియుడే హంతకుడు.
-
జ్యోతిని హతమార్చింది ప్రియుడే
గుంటూరు: సంచలనం సృష్టించిన రాజధానిలో ‘జ్యోతి హత్య’ కేసులో ఆమె కుటుంబసభ్యులు ఊహించిందే జరిగింది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియురాలిని ప్రియుడు శ్రీనివాస్ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. గత కొంతకాలంగా తనను వివాహం చేసుకోవాలని జ్యోతి ఒత్తిడి తేవడంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవడానికి ప్రియుడు క్రైమ్ సినిమాను తలపించేలా పక్కా స్కెచ్ వేసినా ఫలితం లేకపోయింది. పోలీసు దర్యాప్తు ముందు నిందితుడు తలవంచక తప్పలేదు. మంగళగిరి మండలం నవులూరు సమీపంలో అమరావతి టౌన్ షిప్లో ఈ నెల 11వ తేదీ రాత్రి ప్రేమ జంటపై గుర్తు తెలియని అగంతకులు దాడి చేసిన ఘటనలో అంగడి జ్యోతి (25) అక్కడికక్కడే మృతిచెందగా, ప్రియుడు శ్రీనివాసరావు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దాడికి పాల్పడింది ఎవరనే విషయం మిస్టరీగా మారినప్పటికీ పోలీసులు ఎట్టకేలకు నిందితుడెవరనేది చేధించారు. పోలీసు దర్యాప్తులో జ్యోతిని హత్య చేసింది ఆమె ప్రియుడు చుంచు శ్రీనివాసరావేనని తేల్చారు. ప్రియుడు శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి జ్యోతిని హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. జ్యోతిని హత్య చేసేందుకే ఇంట్లో నుంచి పిలిపించేందుకు శ్రీనివాస్ ఒక యువతితో పదేపదే ఫోన్లు చేయించాడని పోలీసులు తెలిపారు. చాలా రోజులుగా పెళ్లి చేసుకోవాలంటూ శ్రీనివాస్‌పై జ్యోతి ఒత్తిడి తేవడంతో పథకం ప్రకారం అంతమొందించాలని ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు. జ్యోతితో శ్రీనివాస్‌కు పెళ్లి ఇష్టం లేకే మర్డర్ ప్లాన్ అమలు పరిచాడని పేర్కొన్నారు. నిందితుడి కాల్‌డేటా ద్వారా కేసును చేధించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా భద్రత పెంచారు. మొదటి నుంచి శ్రీనివాస్‌పైనే జ్యోతి కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులపై కూడా అనుమానాలు ఉన్నాయని, జ్యోతి మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో నిన్న జ్యోతి మృతదేహానికి కుటుంబసభ్యుల సమక్షంలో రీపోస్ట్ మార్టం చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాజీ ప్రియుడి పనేనా? ‘జిరాక్స్ తీసుకుని.. అక్కడే ఫ్రైడ్ రైస్ తిన్నారు’ ‘జ్యోతి మృతిపై అనుమానాలున్నాయి’ -
ప్రియురాలి దీక్ష.. విషం తాగిన ప్రియుడు..
సాక్షి, యాదాద్రి భువనగిరి : ప్రేమించినవాడు పెళ్లి చేసుకోమంటే బుకాయిస్తూ, మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఓ యువతి అతడి ఇంటి ముందు దీక్షకు దిగింది. ఈ ఘటన జిల్లాలోని వలిగొండ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి వలిగొండకు చెందిన రావుల భాస్కర్ ప్రేమించుకున్నారు. అయితే, భాస్కర్ వివాహానికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ అతడి ఇంటి ముందు జ్యోతి దీక్షకు దిగారు. అప్పటికి వివాహానికి నిరాకరించడంతో వలిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా ఫిర్యాదు చేస్తూ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ శనివారం స్థానిక వేంకటేశ్వర థియేటర్ పక్కన ఉన్న సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రియుడు భాస్కర్‌ను వలిగొండ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు పెళ్లి చేసుకోవాలని సూచించారు. అందుకు నిరాకరించిన భాస్కర్ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని హుటాహుటిని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
జ్యోతి ల్యాబ్స్ 1:1 బోనస్
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 29 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.107 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.76 కోట్లకు తగ్గిందని జ్యోతి ల్యాబ్స్ తెలిపింది. తమ కంపెనీలో విలీనమైన హెంకెల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాల రద్దుకు సంబంధించి పన్ను రివర్సల్ కారణంగా నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.468 కోట్ల నుంచి రూ.558 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.424 కోట్ల నుంచి రూ.451 కోట్లకు పెరిగాయని వివరించింది. నిర్వహణ లాభం 46 శాతం పెరిగి రూ.88 కోట్లకు చేరిందని, నిర్వహణ లాభ మార్జిన్ 3.5 శాతం వృద్ధితో 17.1 శాతానికి ఎగసిందని తెలిపింది. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు 50 పైసల డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. అంతే కాకుండా ఒక ఈక్విటీ షేర్‌కు మరో ఈక్విటీ షేర్‌ను బోనస్‌గా(1:1) ఇవ్వనున్నామని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.204 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం తగ్గి రూ.179 కోట్లకు చేరిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,760 కోట్ల నుంచి రూ.1,813 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో జ్యోతి ల్యాబ్స్ షేర్ 5 శాతం లాభంతో రూ.392 వద్ద ముగిసింది. -
మైనర్ బాలిక అదృశ్యం
ధర్మవరం అర్బన్ : పట్టణంలోని బడేసాబ్ వీధికి చెందిన జ్యోతి అనే మైనర్ బాలిక ఈ నెల 20 నుంచి కనిపించలేదని తండ్రి దుర్గన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాకలి శీనా, రమణలపై అనుమానం ఉందని అందులో ఫిర్యాదులో పేర్కొన్నాడు. పట్టణ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసుకుని, బాలిక కోసం గాలిస్తున్నారు. -
చిన్నారి ప్రాణం పోయింది
గుంతకల్లు టౌన్ : చికిత్స కోసం వెళితే చిన్నారి ప్రాణమే పోయింది. ఇంజెక్షన్ వేసిన కొన్ని నిమిషాలకే కన్ను మూసింది. తమ చేతుల మీదే గిలగిలాకొట్టుకుంటూ పాప చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన సురేష్, సులోచన దంపతుల రెండో కుమార్తె జ్యోతి(11నెలలు)కి సోమవారం రాత్రి నుంచి తీవ్రమైన జ్వరం వచ్చింది. మంగళవారం ఉదయం చిన్నారిని వైద్యం నిమిత్తం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని టి.బి.రోడ్‌లోని అరుణ్ క్లినిక్‌లో చిన్న పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ వీరేష్కుమార్ను సంప్రదించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యుడు పాపకు ఇంజెక్షన్ వేశాక రక్తపరీక్షలకు సిఫార్సు చేశారు. ల్యాబ్‌కు తీసుకెళ్లగానే పాప పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించుకుంటూ వైద్యుడి వద్దకు వచ్చారు. ఇంజెక్షన్ వికటించే తమ పాప మరణించిందని, మెరుగైన వైద్యం చేసి ఉంటే బతికి ఉండేదని వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై ధర్నా కేవీపీఎస్ డివిజన్ అధ్యక్షుడు జగ్గిలి రమేష్, కార్యదర్శి వై.శ్రీనివాసులు, రాయలసీమ దళిత సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, ఎమ్మార్పీఎస్ రాయలసీమ కార్యదర్శి స్వామిదాస్ తదితరులు చిన్నారి జ్యోతి మరణానికి కారణమైన డాక్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని క్లినిక్ ఎదుట రోడ్డుపై మృతదేహంతో ధర్నాకు దిగారు. సీఐ గురునాథబాబు, ఎస్ఐ నగేష్‌బాబులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులు, వైద్యుడిని ఒన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్కు తీసుకెళ్లారు. పట్టణంలోని వైద్యులు కూడా స్టేషన్‌కు వచ్చారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన డాక్టర్‌పై కేసు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పాప తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఏ విచారణకైనా సిద్ధమే జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని పరీక్షించి జ్వరం నయం కావడానికి తగిన మోతాదు మేరకు ఇంజెక్షన్ వేశాను. పాప యాక్టివ్‌గా లేని కారణంగా రక్త పరీక్షలు చేయించుకువస్తే ఆ రిపోర్ట్ చూసి తదుపరి మెరుగైన వైద్యం చేస్తానని చెప్పాను. పిల్లల ప్రాణాలు కాపాడేందుకు ఉన్నాం కానీ ప్రాణాలు తీసేందుకు కాదు. నేను ఎటువంటి విచారణకైనా సిద్ధమే. – డాక్టర్ వీరేష్‌కుమార్, చిన్నపిల్లల వైద్యనిపుణుడు -
నీళ్లు కావాలంటే... మద్యం తాగండనట్లుంది
ఆదిలాబాద్ : ప్రజలు నీళ్లు కావాలి మొర్రో అంటే మద్యం తాగండి అన్నట్లుగా టీఆర్ఎస్ సర్కారు తీరు ఉందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి ఎద్దేవా చేశారు. బుధవారం అదిలాబాద్ జిల్లా మందమర్రిలోని కమ్యూనిటీ హల్లో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ... ఓ వైపు తాగడానికి మంచినీళ్లు లేక జనం అలమటిస్తుంటే నూతన మద్యం, సర్కారు చీపులిక్కరు... గుడుంబా కంటే చాలా మంచిదంటూ ప్రభుత్వం ప్రచారం చేయడం హస్యాస్పదమని జ్యోతి ఆరోపించారు. ప్రజలకు కావాల్సింది మంచినీరే కానీ మద్యం కాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించి బంగారు తెలంగాణ నిర్మించుకుందామన్న సీఎం కేసీఆర్ చివరకు తెలంగాణను మద్యంలో ముంచెత్తాలని చేస్తున్నారని జ్యోతి విమర్శించారు. -
మహిళా రైతు బలవన్మరణం
నల్గొండ : వర్షాభావం, అప్పుల బాధతో ఓ మహిళా బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా చివ్వెంల మండలంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని తుల్జారావుపేట్కు చెందిన గుగులోత్ లింగ, జ్యోతి(25) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లింగ రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో జ్యోతి వ్యవసాయ పనులు చూసుకుంటోంది. ఈ ఏడాది ఆరెకరాల భూమి కౌలుకు తీసుకుని... పత్తి పంట సాగు చేసింది. వర్షాభావంతో పత్తి పంట సరిగా పండలేదు. పంట సాగు కోసం చేసిన రూ.3.50 లక్షల అప్పు తీరేదారి కనిపించక తీవ్ర మానసిక ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం చేనుకు వెళ్లి అక్కడున్న చెట్టుకు చీరతో ఉరి వేసుకుని చనిపోయింది. దీంతో ఆమె కుటుంబం దుఖః సాగరంలో మునిగిపోయింది. గుగులోత్ లింగ, జ్యోతి దంపతులకు ఓ కుమార్తెతో పాటు పాఠశాల చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.