మహిళా రైతు బలవన్మరణం | woman farmer suicide in nalgonda district | Sakshi
Sakshi News home page

మహిళా రైతు బలవన్మరణం

Published Sat, Aug 15 2015 5:49 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

woman farmer suicide in nalgonda district

నల్గొండ : వర్షాభావం, అప్పుల బాధతో ఓ మహిళా బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా చివ్వెంల మండలంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని తుల్జారావుపేట్‌కు చెందిన గుగులోత్ లింగ, జ్యోతి(25) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లింగ రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు.

దీంతో జ్యోతి వ్యవసాయ పనులు చూసుకుంటోంది. ఈ ఏడాది ఆరెకరాల భూమి కౌలుకు తీసుకుని... పత్తి పంట సాగు చేసింది. వర్షాభావంతో పత్తి పంట సరిగా పండలేదు.  పంట సాగు కోసం చేసిన రూ.3.50 లక్షల అప్పు తీరేదారి కనిపించక తీవ్ర మానసిక ఆందోళన చెందుతోంది.

ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం చేనుకు వెళ్లి అక్కడున్న చెట్టుకు చీరతో ఉరి వేసుకుని చనిపోయింది. దీంతో ఆమె కుటుంబం దుఖః సాగరంలో మునిగిపోయింది. గుగులోత్ లింగ, జ్యోతి దంపతులకు ఓ కుమార్తెతో పాటు పాఠశాల చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement