మద్యం విధానాన్ని మార్చండి
కేసీఆర్‌కు దత్తాత్రేయ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీతో సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు కొనసాగే మద్యం విక్రయాలతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సమయ నియంత్రణ లేని అమ్మకాలతో పేద కుటుం బాలు ఎక్కువగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమ జీవులు మద్యానికి బానిసలుగా మారుతున్నారని, దీంతో ఉత్పాదకత తగ్గిపోతోందని చెప్పారు.
ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానంతో... బంగారు తెలంగాణ సాధ్యం కాదని విమర్శించా రు. వెంటనే ఈ విధానాన్ని మార్పు చేయాలని సీఎంను కోరారు. ఈమేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అదుపులేని మద్యం విక్రయాలతో జరుగుతున్న అనర్థాలను ఉదాహరణలతో సహా ఆయన లేఖలో వివరించారు.