
ఢిల్లీ, సాక్షి : మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఆప్ నుంచి బయటకు వెళ్తూ ఆ పార్టీపై, సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా స్థాపించిన ఆమ్ ఆద్మీ ‘అవినీతిలో పాలుపంచుకున్న’ పార్టీగా పతనమైందని అన్నారు.
‘అవినీతిపై పోరాటంలో బలమైన సందేశాన్ని చూసిన తర్వాత నేను ఆప్‌లో చేరాను. నేడు, పార్టీ అవినీతి కార్యకలాపాల మధ్యలో కూరుకుపోయింది. అందుకే నేను వైదొలగాలని నిర్ణయించుకున్నాను’ అని గిరిజన శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తెలిపారు.
మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తాజాగా, ఆ పార్టీకి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామాతో రానున్న రోజుల్లో ఆ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment