
కన్నీటి ధారలో కొట్టుకుపోవడం ఖాయం
- ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బి.హైమావతి
- ఇల్లెందుకు చేరిన బస్సు యూత్ర
ఇల్లెందు : రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టి మద్యం రాష్ట్రంగా మార్చాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని, దీనిని నియంత్రించకపోతే మహిళల కన్నీటి ధారలో కేసీఆర్ కొట్టుకుపోతాడని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి బి.హైమావతి హెచ్చరించారు. మద్యాన్ని నియంత్రించాలని.. మహిళలపై పెరుగుతున్న హిం సను అరికట్టాలని కోరుతూ చేపట్టిన ఐద్వా రాష్ట్రవ్యా ప్త బస్సు యాత్ర బుధవారం ఇల్లెందుకు చేరింది. ఈ సందర్భంగా యూత్రకు స్థానిక నేతలు ఘన స్వాగ తం పలికారు. అనంతరం న్యూ బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో హైమావతి ప్రసంగించారు.
మద్యం వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని సాకు లు చెబుతూ గ్రామాలను కలుషితం చేయాలని కేసీఆర్ యత్నిస్తున్నాడని అన్నారు. గంగదేవిపల్లిని దత్త త తీసుకున్నట్లు ప్రకటించిన ఆయనకు గంగదేవిపల్లిలో మద్యం లేకపోవటం వల్లే అభివృద్ధి సాధ్యమైం దన్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. సభకు ఐద్వా డివిజన్ కార్యదర్శ మెరుగు రమణ అధ్యక్షత వ హించగా.. రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, ఉపాధ్యక్షురాలు రత్నమాల, సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ, అఫ్రోజ్ సమీన, మాచర్ల భారతి, సత్యవతి, జైబున్నీసా, సంధ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. బస్సు యాత్రకు సంఘీభావంగా ఇల్లెందు జెడ్పీటీసీ చండ్ర అరుణ, పీఓడబ్ల్యూ నాయకురాలు బయ్య శారద, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు ఏపూరి లలితాదేవి, సీపీఎం డివిజన్ కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకులు దేవులపల్లి యాకయ్య, పిట్టల రవి, కుంటా ఉపేందర్, ఎస్‌ఐ నబీ, కిరణ్, ఆర్.శ్రీను, వజ్జా సురేష్, యూటీఎఫ్ నుంచి రాందాస్ పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం
పాల్వంచ : రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పాలన సాగిస్తూ.. కొత్త ఎక్సైజ్ విధానానికి రూపకల్పన చేస్తోందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత అన్నారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్యాన్ని నియంత్రించి.. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న హింసను అరికట్టాలని అన్నారు. మద్యాన్ని నియంత్రించేలా కొత్త ఎక్సైజ్ విధానాలను మర్చాలని, అన్ని షాపులను రాత్రి పది గంటలకల్లా మూసివేయాలని, జాతీయ రహదారుల వెంట మద్యం షాపులకు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బి.సరళ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.జ్యోతి, ఎం.భారతి, ఎన్.రత్నమాల, మినా, అఫ్రోజ్ సమీనా, డివిజన్ నాయకులు ఎస్.లక్ష్మి, కె.సత్య, వి.వాణి, శకుంతల, ఇందిర, నాగమణి పాల్గొన్నారు.