
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది.
మద్యం పాలసీ కేసులో తాను వారంలో సోమవారం, బుధవారం పోలీస్‌స్టేషన్‌కు హాజరవ్వాల్సి వస్తుందని, ఈ అంశంలో తనకు వెసులు బాటు కల్పించాలని కోరుతూ సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సిసోడియా పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిసోడియా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం తెలిపింది. అయితే, కేసుకు సంబంధించిన విచారణకు మాత్రం తప్పని సరిగా హాజరు కావాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా వేసింది.
माननीय सुप्रीम कोर्ट का हृदय से आभार, जिसने ज़मानत की शर्त को हटाकर राहत प्रदान की है। यह निर्णय न केवल न्यायपालिका में मेरी आस्था को और मजबूत करता है, बल्कि हमारे संवैधानिक मूल्यों की शक्ति को भी दर्शाता है। मैं हमेशा न्यायपालिका और संविधान के प्रति अपने कर्तव्यों का सम्मान करता… https://t.co/er7qTn2QMU
— Manish Sisodia (@msisodia) December 11, 2024
మద్యం పాలసీ కేసులో 17నెలల జైలు జీవితం
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. అరెస్టయిన రెండు రోజుల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్ట్ 9న పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment