
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ భారీ దోపిడీకి తెర లేపిందని ఆరోపించింది వైఎస్సార్‌సీపీ. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారని కామెంట్స్ చేసింది.
వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ వేదికగా..
టీడీపీ భారీ దోపిడీకి తెర!
రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర లేపిన టీడీపీ.
ముఖ్య నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట పరుస్తున్నారు.
టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు అని ఆరోపించింది.
.@JaiTDP భారీ దోపిడీకి తెర!
రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర లేపిన టీడీపీ. ‘‘ముఖ్య’’నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా…— YSR Congress Party (@YSRCParty) October 7, 2024
ఇదే సమయంలో పోలవరంపై కూడా వైఎస్సార్‌సీపీ కీలక వ్యాఖ్యలు చేసింది. పోలవరాన్ని పూర్తి చేస్తాం అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు కేంద్రం రెండేళ్ల గడువిచ్చింది. ఈ గడువులోగా ఆయన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా? ఎప్పట్లానే మాట తప్పి నాలుక మడత వేస్తారా చూడాలి అంటూ వ్యాఖ్యలు చేసింది.
పోలవరాన్ని పూర్తి చేస్తాం అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన @ncbn కు కేంద్రం రెండేళ్ల గడువిచ్చింది. గడువులోగా ఆయన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా? ఎప్పట్లానే మాట తప్పి నాలుక మడత వేస్తారా చూడాలి.#YSRPolavaram pic.twitter.com/LXttcFl6QJ
— YSR Congress Party (@YSRCParty) October 7, 2024
మరోవైపు.. ఉచిత ఇసుకపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. అంబటి ట్విట్టర్ వేదికగా.. నేతి బీరకాయలోని నెయ్యి ఎంతో.. ఉచిత ఇసుక లోని ఉచితం అంత! చంద్రబాబు.. అంటూ వ్యాఖ్యలు చేశారు.
నేతి బీరకాయ లోని నెయ్యి ఎంతో
ఉచిత ఇసుక లోని ఉచితం అంత !@ncbn— Ambati Rambabu (@AmbatiRambabu) October 7, 2024
Comments
Please login to add a commentAdd a comment