న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్ల నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పించుకోలేరని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మండిపడ్డారు. అయితే ఈడీ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్‌కు వరుసగా మూడుసార్లు సమన్లు జారీ చేసిన విసయం తెలిసిందే.
కాగా.. మూడోసారి జారీ చేసిన మమన్ల ప్రకారం కేజ్రీవాల్ 2024 జనవరి 3వ తేదీ ఈడీ ముందు హాజరుకావల్సి ఉంది. అరవింద్ కేజజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఈడీ ముందుకు రావటంలేదని వీరేంద్ర సచ్‌దేవా మండిపడ్డారు. ముడోసారి జారీ చేసిన సమన్ల నుంచి మాత్రం కేజ్రీవాల్ ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోలేరని అన్నారు.
VIDEO | "Initially, he used the excuse of elections and then Vipassana, and now let's see what explanation he gives on January 3. He can't evade this for long, he has to appear before the agency," says BJP leader @Virend_Sachdeva on ED's summon to CM Arvind Kejriwal. pic.twitter.com/GObqIb6fL7
— Press Trust of India (@PTI_News) December 30, 2023
మొదటిసారి ఎన్నికలు, రెండోసారి విపాశన ధ్యానం పేరుతో కేజ్రీవాల్ దూరంగా ఉన్నారని దుయ్యబట్టారు. జనవరి 3న హాజరుకావాలన్న ఈడీ సమన్లపై ఎలాంటి వివరణ ఇస్తారో చూస్తామని తెలిపారు. అయితే సుదీర్ఘం కాలం మాత్రం ఈడీ సమన్ల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని అన్నారు. కచ్చితంగా కేజ్రీవాల్ ఈడీ ముందుకు హాజరు కావాల్సిందేనని తెలిపారు.
ఇక సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ మొదటిసారి నవంబర్ 2న, రెండోసారి డిసెంబర్18న, మూడోసారి డిసెంబర్ 21న సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన సీఎం కేజ్రీవాల్ జనవరి 3న ఈడీ ముందుకు హాజరవుతారో? లేదో? అని పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment