
మద్యంపై ఉద్యమం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విచ్చలవిడి గా అమ్మకాలు జరి పేలా ఉన్న మద్యం పాలసీపై మహిళలు పెద్దఎత్తున ఉద్య మించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం గురువారం జరి గింది. లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళల సమస్యలపై పోరాట కార్యాచరణ రూపొం దించుకోవాలని చెప్పారు.
ఈ నెల 23, 24 తేదీల్లో వరంగల్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతాయన్నారు. మోదీ విధానాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లా కృషిచేయాలన్నారు. మద్యం అమ్మకా లతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.45వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకొం టుంటే... మరో వైపు మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నా యన్నారు. మహిళామోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ, కె.పుష్పలీల పాల్గొన్నారు.