
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విడుదల చేశారు. నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ వరకు కొత్త మద్యం విధానం అమలులో ఉంటుంది. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులు ఖరారు చేయనుంది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులకు పెంచింది. లాటరీ విధానం ద్వారా మద్యం షాపుల ఎంపిక ఉంటుంది. ధరఖాస్తు ఫీజును రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు పెంచారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాలలో రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరచి ఉంటాయి. ఈ నెలాఖరులోగా లాటరీ విధానం ద్వారా మద్యం లైసెన్స్ దారుల ఎంపిక ఉంటుందని సోమేష్ కుమార్ పేర్కొన్నారు.