సాక్షి, నెల్లూరు: ఏపీలో మద్యం పాలసీ టీడీపీ ప్రజాప్రతినిధులకు వరంగా మారిందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మంత్రిగా ఉన్న నారాయణ.. తన పార్టీ వారికే షాప్స్ ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు ఏపీలో లిక్కర్ సిండికేట్ మాఫియా నడుపుతున్నారని కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి కాకాణి బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో లిక్కర్ మాఫియా నడుస్తోంది. గతంలో ప్రభుత్వ మద్యం షాప్స్ ఉంటే.. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. మద్యం పాలసీ టీడీపీ ప్రజాప్రతినిధులకు వరంగా మారింది. మద్యం టెండర్స్‌ను టీడీపీ నేతలు అన్ని విధాలుగా వాడుకుంటున్నారు. రెండు లక్షల 50వేల కోట్ల రూపాయలు గతంలో తన వారికి మద్యంలో దోచిపెట్టారు. ఎమ్మెల్యేలు ఎవరికి చెబితే వారికి దుకాణాలు ఇవ్వమని ప్రభుత్వం నుంచి ఎక్సైజ్ అధికారులకి ఆదేశాలు వచ్చాయి.
మంత్రిగా పని చేస్తున్న నారాయణ.. తన పార్టీ వారికే షాప్స్ ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు. దరఖాస్తులు వేయకుండా మద్యం వ్యాపారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు కూడా వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కొన్ని చోట్ల 30 శాతం వాటా ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. మద్యం పాలసీ విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబడుతున్నాం. పాలసీని రద్దు చేసి.. పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలి అని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలాగే హర్యానా ఫలితాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment