సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ల అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లాగానే హర్యానా ఎన్నికల ఫలితాలు కూడా ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు వైఎస్ జగన్. ఇప్పటికైనా ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
హర్యానా ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఏపీలోలాగే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మనలాంటి ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి.
అభివృద్ధి చెందిన దేశాలలో ఎన్నికల్లో ఇప్పటికీ బ్యాలెట్‌లనే వాడుతున్నారు. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయి. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్లకే వెళ్లటం మంచిది. అప్పుడే ఓటర్లలో కూడా విశ్వాసం పెరుగుతుంది. ఓటర్లలో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’ అని కోరారు.
Yet another election result confounds popular perception. Haryana election result is no different from Andhra Pradesh, on which cases are pending in courts. In a democracy like ours, Democracy should not only be prevalent but also be seen to be thriving. Only way to ensure both,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 9, 2024
Comments
Please login to add a commentAdd a comment