
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం కంటే మహిళల ఆరోగ్యమే ముఖ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మంగళవారం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం బెల్టు షాపులను పూర్తిగా నియంత్రించామని తెలిపారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. మద్యం నియంత్రణలో భాగంగా ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తోందన్నారు. అందుకోసమే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చినట్టు వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా మద్యం అమ్మకాలను పెంచారని మండిపడ్డారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం షాపులను భారీగా తగ్గించిందని వెల్లడించారు. సుదీర్ఘ పాదయాత్రలో మహిళల కష్టాలను చూసిన సీఎం వైఎస్ జగన్ మద్యపాన నిషేధాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను నిలుబెట్టుకునేలా సీఎం వైఎస్ జగన్ మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment