
ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో మద్యానికి ఓకే: సుప్రీం
ఢిల్లీ: కేరళ ప్రభుత్వ మద్యం విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఫైవ్ స్టార్ హోటల్స్, అనుమతించిన బార్లలో మాత్రమే మద్యం విక్రయించాలని కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది. కేరళ బార్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేవేస్తూ మంగళవారం కోర్టు తీర్పు వెలవడింది. ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప మిగిలిన చోట్ల మద్యం విక్రయించడాన్ని నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబరులో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కేరళ ప్రభుత్వం చర్య వివక్షతతో కూడినదిగా వుందంటూ బార్ యజమానులు విమర్శించారు. దీనివల్ల తాము చేసే వ్యాపారం కోల్పోతున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బార్ యజమానులు సుప్రీంను ఆశ్రయించి పిటిషిన్ దాఖలు చేశారు. బార్ యాజమానుల పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తూ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో మాత్రమే మద్యం విక్రయాలు జరపొచ్చునని తీర్పు వెల్లడించింది.