న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలను నీటి కష్టాల పాలు చేస్తారా? ఢిల్లీని నాశనం చేస్తారా? అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. తాగునీటి సమస్యలపై సంబంధిత మంత్రికి సీఎం కేజ్రీవాల్ లేఖ రాస్తే దానిపై కేసులు వేశారని మండపడ్డారామె. బుధావారం సునీతా కేజ్రీవాల్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.
‘రెండు రోజుల క్రితం సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాగునీటి సమస్యలకు సంబంధించి మంత్రి అతిశీకి ఆదేశాల లేఖ పంపారు. వాటి మీద కేంద్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఢిల్లీని నాశనం చేస్తారా? ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా బాధపడుతున్నారు. ఇప్పటి వరకు ఈడీ 250 సోదాలు జరిపింది.
ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ డబ్బు కోసం సోదాలు చేశారు. కానీ వారికి తమ వద్ద ఎటువంటి డబ్బు లభించలేదు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్చి 28(గురువారం) అన్ని విషయాలు బయటపెడతారు. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడ ఉందో కూడా చెబుతారు. వాటికి సంబంధించి కేజ్రీవాల్ ఆధారాలు కూడా సమర్పిస్తారు’ అని సునిత కేజ్రీవాల్ తెలిపారు. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత రెండోసారి ఆమె ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు.
ఇక.. మర్చి 21న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ను ఈడీ.. కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు కోర్టు.. ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక..ఈడీ లాకప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనిపై బీజేపీ మండిపడుతూ.. సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది
Comments
Please login to add a commentAdd a comment