న్యూఢిల్లీ: లిక్కర్‌స్కామ్ కేసులో జైలు పాలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలను ఆయన భార్య సునీత కేజ్రీవాల్ భుజానికెత్తుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి తానే స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం(ఏప్రిల్28) పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి తరపున సునీత రోడ్‌షోలో పాల్గొన్నారు.
దేశంలో నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని రోడ్‌షోలో సునీత కోరారు. ప్రజల కోసం పనిచేసినందుకే తన భర్త కేజ్రీవాల్‌ను జైలుకు పంపించారన్నారు.
తీహార్ జైలులో ఆయన సుగర్ వ్యాధికి సరైన చికిత్స అందించడం లేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను చంపాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఒక సింహం ఆయనను ఎవరూ ఏం చేయలేరన్నారు.
సునీతా కేజ్రీవాల్‌కు ఇది రెండో షో. శనివామే సునీత తన రోడ్‌షోలు ప్రారంభించారు. తొలి రోడ్‌షో తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలోని కోండ్లిలో నిర్వహించారు. ఢిల్లీలో మే 25న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment