ఢిల్లీ: ఆప్ పార్టీ తరపున ఏప్రిల్ 27 నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రోజు (ఆదివారం) పశ్చిమ ఢిల్లీ నియోజక వర్గంలో ఆప్ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు మద్దతు కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించారు.
ఢిల్లీ రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. భారతమాత కుమార్తెగా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన భర్త సింహం అని, ఆయన్ను ఎవరూ పడగొట్టలేరని అన్నారు. కారు సన్‌రూఫ్‌లోంచి నిల్చుని ఓటర్లకు అభివాదం చేశారు.
పాఠశాలలు కట్టడం, ఉచిత విద్యుత్ అందించడం, మొహల్లా క్లినిక్‌లు ప్రారంభించి ప్రజలకు మంచి పనులు చేసినందుకే జైలుకెళ్లారని
సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఆయన (కేజ్రీవాల్) భరతమాత పుత్రుడు, నియంతృత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేసి ప్రజాస్వామ్యం కాపాడుకోవడం మీ బాధ్యత. దయచేసి దీని విలువ అర్థం చేసుకోండి అని ఆమె అన్నారు.
లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ఆప్' తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టింది.
जनता के इस सैलाब के आगे,
कोई तानाशाह टिक नहीं सकता 🔥
अपने बेटे, अपने भाई केजरीवाल को आशीर्वाद देने सड़कों पर उमड़ी पश्चिमी दिल्ली की जनता 💯#KejriwalKoAshirwad pic.twitter.com/ZTPl8LrsaS— AAP (@AamAadmiParty) April 28, 2024
Comments
Please login to add a commentAdd a comment